ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇచ్చేనా..?

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్‌ ఫలితాలు అశాజనకంగా ఉన్నట్లు సైటింస్టులు ప్రకటించారు. మానవులపై క్లినికల్ ట్రయల్స్ అనంతరం తమ టీకా కరోనా వైరస్‌ను సమర్థవంతంగా తిప్పికొట్టగలదాన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు సైంటిస్టులు.

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇచ్చేనా..?
COVID-19 vaccine
Follow us

|

Updated on: Jul 21, 2020 | 7:43 PM

కరోనా మహమ్మారి వికృతరూపానికి విలవిలాడుతున్న ప్రపంచమంతా వ్యాక్సిన్‌ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ప్రపంచ దేశాలన్ని కరోనా కట్టడికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కొవిడ్ నుంచి విముక్తి కలిగించేందుకు 140కి పైగా ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్‌ ఫలితాలు అశాజనకంగా ఉన్నట్లు సైటింస్టులు ప్రకటించారు. మానవులపై క్లినికల్ ట్రయల్స్ అనంతరం తమ టీకా కరోనా వైరస్‌ను సమర్థవంతంగా తిప్పికొట్టగలదాన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు సైంటిస్టులు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తాము ఉత్పత్తి చేసిన ఆస్ట్రాజెనికా టీకా కరోనా వైరస్‌తో సమర్థంగా పోరాడగలదని ప్రకటించింది. అంతేకాకుండా తమ టీకా చాలా సురక్షితమని వెల్లడించింది. అందరూ ఊహించినట్లే కరోనా వ్యాక్సిన్ అధ్యయన ప్రాథమిక ఫలితాలను ఆక్స్‌ఫర్డ్ ప్రకటించింది. తమ రూపొందించిన వ్యాక్సిన్ వైరస్‌ను సమర్థవంతంగా తట్టుకోగలదని ఆక్స్‌ఫర్డ్ తెలిపింది. వ్యాక్సిన్ వినియోగం ద్వారా మనుషుల్లో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరిగినట్లు వివరించింది. ఈ మేరకు మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’లో ఫేజ్ 1, 2 క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. మరిన్ని ఫలితాల కోసం చివరి దశగా వృద్ధులపై ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరి వరకు తాము చేస్తున్న ప్రయోగాలకు పూర్తిస్థాయి ఫలితాలు వస్తాయని ఆక్స్‌ఫర్డ్ అశాభావం వ్యక్తం చేసింది.

అయితే, ఫేజ్ వన్ క్లినికల్ ట్రయల్‌లో భాగంగా ఏప్రిల్, మే నెలల్లో బ్రిటన్ కు చెందిన ఐదు ఆసుపత్రులలో 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన 1,077 మంది ఆరోగ్యకరమైన పెద్దలకు వ్యాక్సిన్ మోతాదు ఇవ్వడం జరిగింది. వీరందరిలో సత్ఫలితాలు వచ్చినట్లు ఆక్స్‌ఫర్డ్ తెలిపింది. అందరిలోనూ రోగనిరోధక శక్తి రెట్టింపు అయినట్లు వెల్లడించారు. భారత్‌కు చెందిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా.. ఆస్ట్రాజెనెకా ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధికి సంబంధించి ఒప్పందం కుదిరినట్లు సమాచారం. వచ్చే నెలలో భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని ఆక్స్‌ఫర్డ్ తెలిపింది.

ఇదిలావుంటే, ప్రపంచవ్యాప్తంగా వైరస్ కట్టడికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయటానికి, ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా ఫలితాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. హడావిడిగా వచ్చే వ్యాక్సిన్ ఎంతవరకు విజయవంతమవుతుందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోల్‌కతాలోని సిఎస్‌ఐఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (సిఎస్‌ఐఆర్-ఐఐసిబి) లోని సీనియర్ శాస్త్రవేత్తఉపసనా రే వ్యాక్సిన్ పై స్పందించారు. టీకా హ్యూమరల్, సెల్ మెడియేటెడ్ రోగనిరోధక శక్తిని ఉత్పత్తి చేయగలదని వైరాలజిస్ట్ ఉపసనా రే అన్నారు. సమర్థవంతమైన రోగనిరోధక జ్ఞాపకశక్తిని అందించడానికి, దీర్ఘకాలిక రక్షణకు కూడా అవసరమన్నారు రే. రోగనిరోధక శక్తి ఉత్పత్తి అయ్యే ప్రతిరోధకాలు, టి సెల్ గణనల పరంగా ఎక్కువసేపు ఉంటుందంటున్నారు. టీకా ద్వారా రోగనిరోధక ప్రతిస్పందన ఉందని అధ్యయనం చూపించినప్పటికీ, శాస్త్రవేత్తలు ఇది వాస్తవంగా కరోనావైరస్ సంక్రమణను నివారించగలదా లేక తగ్గిస్తుందో చూపించే ప్రత్యక్ష సాక్ష్యాలు తమ అభిప్రాయాలు వెల్లడించలేదని హెచ్చరించారు. అందరిలోనూ ఒకేలా రోగనిరోధక రక్షణను అందించకపోవచ్చంటున్నారు. అందువల్ల, భవిష్యత్తులో టీకాలు వేసిన వ్యక్తులను పర్యవేక్షించగల దీర్ఘకాలిక జనాభా-ఆధారిత అధ్యయనాలు ముఖ్యమని CSIR-IICB వైరాలజిస్ట్ తెలిపారు. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ, కొవిడ్ మరణాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో విస్తృతమైన పరీక్షలు జరగాల్సిన అవసరముందని ఆమె అన్నారు.

మరోవైపు.. కరోనా వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా సుమారు 140 పైగా పరిశోధనలు చేస్తుండగా.. వీటిలో 20 పైగా పరిశోధనలు ముందు వరుసలో ఉన్నాయి. ఆశలు రేపుతున్నాయి. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ వచ్చే నెలలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని రష్యా ప్రకటించింది. వ్యాక్సిన్‌పై ప్రయోగాలు విజయవంతం కావడంతో ఉత్పత్తికి సంబంధించిన చర్యలు వేగవంతం చేసినట్లు వెల్లడించింది.

సహజమైన ఇన్ఫెక్షన్ తర్వాత కనిపించే మార్పుల్లో పెద్దగా ప్రతిస్పందనలతో ప్రాథమిక ఫలితాలు చాలా ఆశాజనకంగా కనిపిస్తాయని పీడియాట్రిక్ ఇన్ఫెక్షన్ & రోగనిరోధక శక్తి ప్రొఫెసర్, ది వ్యాక్సిన్ సెంటర్, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ డైరెక్టర్ బీట్ కాంప్మన్ తెలిపారు. టీకా అందించిన వ్యక్తిలో ఉహించని భయంకరమైన ప్రతికూల ప్రభావాలను చూపించకపోవచ్చంటున్నారు.

ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా