Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో అకాలవర్షం భయపెడుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్‌ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతాల్లో జోరుగా వానపడింది. ఇటు వికారాబాద్‌ జిల్లా పర్గితో పాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోనూ వర్షం కురిసింది. వేసవి కాలంలో పడుతున్న ఈ అకాలవర్షంతో జనం బెంబేలెత్తారు. మామూలుగా అయితే ఈ వర్షాలకు జనం సేదతీరేవారే! కానీ కరోనా కాలం కావడంతో వైరస్‌ వ్యాప్తి చెందుతున్న భయం వెంటాడుతోంది
  • లాక్‌డౌన్‌పై ప్రజలకు పూర్తి అవగాహన ఉండటంతో మంచి సహకారమే అందుతోందని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ తెలిపారు. అంతర్‌ రాష్ట్రాల మధ్య రాకపోకలను కట్టడి చేసేందుకు చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 5 వేల కేసులు నమోదుచేశామన్నారు.
  • ఆరోగ్యసేతు యాప్‌లో కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారంతోపాటు... వ్యాధి లక్షణాలు, దగ్గర్లో ఎక్కడెక్కడ హెల్త్‌ సెంటర్స్‌ ఉన్నాయన్న సమాచాం లభిస్తుంది. వీటితోపాటు మనం కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి ప్రాంతానికి వెళ్తే అలర్ట్ వస్తుంది. అయితే కొన్నిచోట్ల ఈ యాప్‌ పనిచేయడం లేదు. దీంతో గందరగోళానికి పడిపోయిన వినియోగదారులు.
  • కరోనా భూతాన్ని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది.. . ఇవాళ భేటి అయిన కేంద్ర కేబినెట్‌ ఇందుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా మహమ్మారిపై యుద్ధం చేయడానికి నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో పార్లమెంట్‌ సభ్యుల వేతనాల్లో 30 శాతం కోత విధించారు.. ఏడాది పాటు కోత ఉంటుంది.
  • కరోనా వ్యాధి ప్రబలడం తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనలను, అంతర్జాతీయ స్థాయిలో పాటించబడిన పద్దతులను మనం అనుసరిస్తున్నామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.

హరితహారం మొక్కల్ని తిన్న మేకలు: యజమానికి రూ.500 ఫైన్

Owner fined rs 500 after goats eat haritha haram plants in telangana, హరితహారం మొక్కల్ని తిన్న మేకలు: యజమానికి రూ.500 ఫైన్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రతీ సంవత్సరం కొనసాగిస్తోంది. దీంట్లో భాగంగా  నర్సరీలను ఏర్పాటు చేసి పలు జాతుల మొక్కల్ని పెంచుతున్నారు. ఇదిలా ఉంటే హరితహారం కోసం నర్సరీల్లో పెంచిన మొక్కలను  మేకలు తినేశాయి. దీంతో సదరు మేకల యజమానికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిధిలోని చిలుకూరులో జరిగింది.  చిలుకూరు దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన నర్సరీలోకి మేకలు ప్రవేశించి ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు ఏపుగా ఎదిగిన మొక్కల్ని మేసేశాయి. దీంతో మేకల యజమానికి చిలుకూరు పంచాయతీ కార్యదర్శి రూ. 500 జరిమానా విధించి వసూలు చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవ్వరైనా సరే హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను ధ్వంసం చేయాలని చూసినా, పీకేసినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related Tags