హిందుస్థాన్‌కు శత్రవులైతే మనకూ శత్రువులే:ఒవైసీ

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి, తదనంతర పరిణామాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. పుల్వామాలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. బాంబులు, ఆత్మాహుతి దాడులను ఇస్లాం క్షమించదని, ఇస్లాం పేరుతో జైషే, ఐసిస్ వంటి సంస్థలు చేసే అరాచకాలకు మనం వ్యతిరేకం. పుల్వామాలో మన జవాన్లను పాకిస్థాన్ పొట్టన పెట్టుకుంది. హిందుస్థాన్‌కు శత్రవులైతే మనకూ శత్రువులే, అభినందన్ పోరాటం అభినందనీయం అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు అనేక మంది విమర్శించారు. బీజేపీతో […]

హిందుస్థాన్‌కు శత్రవులైతే మనకూ శత్రువులే:ఒవైసీ
Follow us

|

Updated on: Mar 02, 2019 | 1:12 PM

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి, తదనంతర పరిణామాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. పుల్వామాలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. బాంబులు, ఆత్మాహుతి దాడులను ఇస్లాం క్షమించదని, ఇస్లాం పేరుతో జైషే, ఐసిస్ వంటి సంస్థలు చేసే అరాచకాలకు మనం వ్యతిరేకం. పుల్వామాలో మన జవాన్లను పాకిస్థాన్ పొట్టన పెట్టుకుంది. హిందుస్థాన్‌కు శత్రవులైతే మనకూ శత్రువులే, అభినందన్ పోరాటం అభినందనీయం అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు అనేక మంది విమర్శించారు. బీజేపీతో టీఆర్ఎస్ కలిసిపోతుందని వ్యాఖ్యానించారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ముస్లిం పార్టీగా మాకు తెలుసు అని ఒవైసీ అన్నారు. ఈ క్రమంలో చంద్రబాబును ఒవైసీ హెచ్చరించారు. నేను ఏపీకి వస్తున్నా చంద్రబాబు కాసుకో.. జగన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తా అని ఒవైసీ అన్నారు.