లక్కీ ఫెలో.. 30 వేలు పోగొట్టుకుని.. 8 లక్షలు సంపాదించాడు..

దేశ రాజధానిలో ఓ తోపుడు బండి వ్యాపారి వద్ద ఉన్న మామిడి పళ్ళను జనం దోచుకుపోయారు. 30 వేల రూపాయల విలువైన పండ్లు దోచుకోవడంతో బోరుమన్నాడు అయితే.. ఆ వ్యాపారి ధుఖిస్తున్న వీడియో

లక్కీ ఫెలో.. 30 వేలు పోగొట్టుకుని.. 8 లక్షలు సంపాదించాడు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 25, 2020 | 1:49 PM

దేశ రాజధానిలో ఓ తోపుడు బండి వ్యాపారి వద్ద ఉన్న మామిడి పళ్ళను జనం దోచుకుపోయారు. 30 వేల రూపాయల విలువైన పండ్లు దోచుకోవడంతో బోరుమన్నాడు అయితే.. ఆ వ్యాపారి ధుఖిస్తున్న వీడియో న్యూస్ చానల్స్ లో ప్రసారమైంది, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో ఎంతో మంది మనసున్న మనుషులు స్పందించారు. ఆ చిరు వ్యాపారికి 8 లక్షల రూపాయల డొనేషన్లు ఇచ్చారు.

వివరాల్లోకెళితే.. ఢిల్లోలో చోటు అనే వ్యక్తి బండి మీద మామిడి పళ్లు పెట్టుకుని అమ్ముతుంటాడు. ఈ క్రమంలో నిన్న ఓ స్కూల్‌ దగ్గర పండ్ల బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటుండగా.. చోటుకు, పక్క దుకాణదారుకి గొడవ జరిగింది. వారిద్దరూ అలా గొడవపడుతుండగా ఆ పక్క వెళ్లే జనాలు దీన్ని అదునుగా భావించి చోటు బండి మీద ఉన్న మామిడి పళ్లను అందినకాడికి అందుకుని వెళ్లారు. కొందరు హెల్మెట్‌లో పెట్టుకుని మరీ వెళ్లారు. చోటు వచ్చి చూసేసరికి బండి మొత్తం ఖాళీ అయ్యింది.

కాగా.. దాదాపు 30 వేల రూపాయల విలువైన మామిడి పళ్లను ఎత్తుకెళ్లారు జనాలు. ఖాళీ బండి చూసి లబోదిబోమన్నాడు చోటు. అసలే లాక్‌డౌన్‌తో కష్టాల్లో ఉన్న తనకు ఇలా జరగడంతో ఇక కోలుకోలేనని బోరుమన్నాడు చోటూ. . దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో చాలా మంది దాతలు మానవత్వంతో స్పందించారు. అతని బ్యాంకు ఖాతా నెంబర్ తెలుసుకొని అనేక మంది డబ్బులు పంపించారు. దీంతో అతని బ్యాంకు ఖాతాలో దాదాపు రూ. 8లక్షలు జమ అయ్యాయి. దీనిపై చోటు అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేశాడు.