సామర్థ్యానికి మించి ప్రయాణికులు.. మునిగిన బోటు..

భారత్‌లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. అందుకే లాక్ డౌన్ మే 3వరకు పొడిగించారు. ఈ క్రమంలో యూపీ‌లో పడవ ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి మించి 15 మందితో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తాపడింది.

సామర్థ్యానికి మించి ప్రయాణికులు.. మునిగిన బోటు..
Follow us

| Edited By:

Updated on: Apr 18, 2020 | 7:49 PM

భారత్‌లో కోవిద్-19 వేగంగా విస్తరిస్తోంది. అందుకే లాక్ డౌన్ మే 3వరకు పొడిగించారు. ఈ క్రమంలో యూపీ‌లో పడవ ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి మించి 15 మందితో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తాపడింది. సీతాపూర్‌లోని శారదా నదిలో గునియా ఘాట్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 14 ఏళ్ల బాలిక మునిగిపోగా, మరో బాలిక(12) గల్లంతైనట్టు పోలీసులు తెలిపారు. బోటులో మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నట్టు చెప్పారు.

కాగా.. బాధితులు పొల్లాల్లో పని పూర్తి చేసుకున్న అనంతరం తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. మిగతా 13 మందిని రక్షించినట్టు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఈనెల 20 నుంచి.. జాతీయ రహదారులపై.. టోల్ వసూల్..