Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
  • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
  • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
  • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
  • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

ఈ వాటర్ ట్యాంక్ కట్టి నాలుగేళ్లు కాలేదు.. ఎలా కుప్పకూలిందో చూడండి

Overhead Water Tank Collapses In West Bengal's Bankura Sarenga, ఈ వాటర్ ట్యాంక్ కట్టి నాలుగేళ్లు కాలేదు.. ఎలా కుప్పకూలిందో చూడండి

పశ్చిమ బెంగాల్‌లో ఈ సంఘటన చూస్తే అక్కడ అధికారుల పనితీరు ఎంత బాగుందో అర్థమవుతోంది. బంకురా జిల్లాలోని ఓ వాటర్ ట్యాంక్ అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయింది. అది ఏ పురాతన ట్యాంక్ అంటే పప్పులో కాలేసినట్లే. సరిగ్గా నాలుగేళ్ల క్రితమే దానిని ఓపెనింగ్ చేశారు. 7 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంక్ ద్వారా.. దాదాపు 15 గ్రామాలకు వాటర్ సప్లై చేయబడుతుంది. అయితే 2016లో ప్రారంభించిన ఈ ట్యాంక్.. బుధవారం రోజు మధ్యాహ్నం.. అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. అదే సమయంలో అక్కడ ఉన్న కొందరు ఈ సంఘటనను వీడియో తీశారు. భారీ శబ్ధంతో కేవలం సెకన్ల వ్యవధిలోనే కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను అక్కడివారు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.

కాగా, ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. అక్కడి భూమి వదులుగా ఉండటంతో ఘటన జరిగి ఉండొచ్చని చెబుతున్నారు. ట్యాంక్ కూలిన ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదన్నారు. ట్యాంక్ నిర్మించిన సంస్థతో ఐదేళ్లు కాంట్రాక్ట్ ఉందని..ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

Related Tags