పోలీసు ట్రైనింగ్ స్కూల్ లో 90 మందికి పాజిటివ్

కరోనా కల్లోలానికి దేశం విలవిలలాడుతోంది. కొత్త నమోదు అవుతున్న కేసులు మరింత కలవరాన్ని కలిగిస్తోంది. తాజాగా పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో 90 మందికి పైగా ట్రైనీలకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. బెంగళూరు సమీపంలోని థణిసంద్ర పోలీస్ ట్రైనింగ్ స్కూల్‌లో ఓ కానిస్టేబుల్‌కి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

పోలీసు ట్రైనింగ్ స్కూల్ లో 90 మందికి పాజిటివ్
Follow us

|

Updated on: Jul 24, 2020 | 2:58 PM

కరోనా కల్లోలానికి దేశం విలవిలలాడుతోంది. కొత్త నమోదు అవుతున్న కేసులు మరింత కలవరాన్ని కలిగిస్తోంది. తాజాగా పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో 90 మందికి పైగా ట్రైనీలకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. బెంగళూరు సమీపంలోని థణిసంద్ర పోలీస్ ట్రైనింగ్ స్కూల్‌లో ఓ కానిస్టేబుల్‌కి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ట్రైనింగ్ సెంటర్ లోని అందరికీ కరోనా ర్యాండమ్ పరీక్ష నిర్వహించారు. కొత్తగా చేరిన దాదాపు 400 మంది కానిస్టేబుళ్లు పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్నారు. కరోనా సోకినట్టు గుర్తించిన ట్రైనీలను కొవిడ్ ఆస్పత్రులకు, కేర్ సెంటర్లకు పంపించారు. ప్రైమరీ కాంటాక్ట్ లో గుర్తించిన మరో 150 మందిని క్వారంటైన్‌కి పంపారు. అనంతరం స్కూల్ పరిసరాలను మొత్తం శానిటైజేషన్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. బెంగళూరు వ్యాప్తంగా ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఇందులో తొమ్మిది మంది పోలీసులు ప్రాణాలను కోల్పోయారు. మరోవైపు ట్రైనీ పోలీసుల ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉన్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.