ఢిల్లీలో భారీగా పొగమంచు.. 760 విమాన రాకపోకల్లో జాప్యం!

జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో ఉత్తర భారతదేశంలో అతి శీతల వాతావరణం నెలకొంది. ఢిల్లీ లో పొగమంచు కారణంగా 760 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి, 19 విమానాలు రద్దయ్యాయి. అయితే 100 కి పైగా రైళ్లు 2 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. జాతీయ రాజధాని ఢిల్లీలో 6.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. భారీ పొగమంచు కారణంగా రైలు, విమాన సర్వీసులు ఆలస్యమవుతున్నాయి. “ఉదయం దేశ రాజధానిని కప్పిన దట్టమైన […]

ఢిల్లీలో భారీగా పొగమంచు.. 760 విమాన రాకపోకల్లో జాప్యం!
Follow us

| Edited By:

Updated on: Dec 21, 2019 | 4:01 PM

జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో ఉత్తర భారతదేశంలో అతి శీతల వాతావరణం నెలకొంది. ఢిల్లీ లో పొగమంచు కారణంగా 760 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి, 19 విమానాలు రద్దయ్యాయి. అయితే 100 కి పైగా రైళ్లు 2 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. జాతీయ రాజధాని ఢిల్లీలో 6.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. భారీ పొగమంచు కారణంగా రైలు, విమాన సర్వీసులు ఆలస్యమవుతున్నాయి. “ఉదయం దేశ రాజధానిని కప్పిన దట్టమైన పొగమంచు కారణంగా పంతొమ్మిది విమానాలు రద్దు చేయబడ్డాయి, ఐదు మళ్లించబడ్డాయి మరియు 760 ఆలస్యమయ్యాయి” అని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు తెలిపారు. డిసెంబర్ 21 వరకు భారీ హిమపాతం ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది.

జమ్మూ కాశ్మీర్, లడఖ్ లో చలి తీవ్రంగా ఉంది. రాబోయే రెండు రోజులలో విస్తృతంగా వర్షాలు, హిమపాతం సంభవిస్తుందని వాతావరణశాఖ అంచనా. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనివల్ల లోయలో వేలాది వాహనాలు చిక్కుకుపోయాయి. కాశ్మీర్‌కు ప్రవేశ ద్వారం జవహర్ టన్నెల్ వద్ద ఈ సాయంత్రం నాటికి ఆరు అంగుళాల మంచు నమోదైందని ట్రాఫిక్ విభాగం అధికారి తెలిపారు. రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని చాలా ప్రాంతాలలో రాత్రి ఉష్ణోగ్రత తగ్గింది. లడఖ్ లో మైనస్ 16.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

[svt-event date=”21/12/2019,3:52PM” class=”svt-cd-green” ]

[/svt-event]