గువాహటి జైలులో 44 శాతం మంది ఖైదీలకు కరోనా..

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అసోం లోని గువాహటి సెంట్రల్ జైలులో 435 మంది ఖైదీలకు కరోనా సోకింది. ఈ జైలులో ఉన్న ఖైదీల్లో 44శాతం మందికి

గువాహటి జైలులో 44 శాతం మంది ఖైదీలకు కరోనా..
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2020 | 2:18 PM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అసోం లోని గువాహటి సెంట్రల్ జైలులో 435 మంది ఖైదీలకు కరోనా సోకింది. ఈ జైలులో ఉన్న ఖైదీల్లో 44శాతం మందికి కరోనా సోకడం సంచలనం రేపింది. జైలులో ఉన్న రైతు నాయకుడు అఖిల్ గొగోయ్, స్టూడెంట్ యాక్టివిస్టు షర్జీల్ ఇమాంలకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారితోపాటు ఖైదీలకు మెరుగైన వైద్యం అందించాలని అసోం హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ముగ్గురు ఖైదీలు సోనాపూర్ సివిల్ హాస్పిటల్ నుండి తప్పించుకున్న తరువాత జైలు లోపల సీసీటీవీ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా ప్రభావితమైన గువహతి సెంట్రల్ జైలులో ప్రస్తుతం 435 మంది ఖైదీలకు, మిగతా 10 జైళల్లో 535 మందికి కరోనా సోకిందని అసోం జైళ్ల శాఖ ఇన్ స్పెక్టరు జనరల్ దశరథదాస్ చెప్పారు. దీంతో తాము గువాహటి జైలులో 200 పడకలతో కొవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశామని జైలు అధికారులు చెప్పారు. అసింప్టమాటిక్ కరోనా రోగులను నాగామ్ ప్రత్యేక జైలులో ఉంచాలని నిర్ణయించినట్లు జైళ్ల శాఖ అధికారులు వివరించారు. జైళ్లలోని ఖైదీలందరికీ కరోనా పరీక్షలు చేశామని అధికారులు తెలిపారు.

Also Read: హైదరాబాద్‌కు మరో ఘనత.. దేశంలోనే మొదటి స్థానం.. 

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు