పూరీ ఆలయానికి కరోనా దెబ్బ.. 400 మంది సిబ్బందికి పాజిటివ్

కరోనా మహమ్మారి ఇందు లేదు అందు కలదు అన్నట్లు అన్ని చోట్లకు పాకింది. ప్రపంచాన్ని వణికిస్తున్న రాకాసి ఆలయాలను సైతం వదలడంలేదు.

పూరీ ఆలయానికి కరోనా దెబ్బ.. 400 మంది సిబ్బందికి పాజిటివ్
Follow us

|

Updated on: Sep 29, 2020 | 1:51 PM

కరోనా మహమ్మారి ఇందు లేదు అందు కలదు అన్నట్లు అన్ని చోట్లకు పాకింది. ప్రపంచాన్ని వణికిస్తున్న రాకాసి ఆలయాలను సైతం వదలడంలేదు. సుప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయంలో పనిచేస్తున్న 400 మందికి పైగా సిబ్బందికి కరోనా పాజిటివ్ సోకినట్లు ఒడిశా ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రధాన ఆలయంతో పాటు పూరీ శిరిమందిరాన్ని తిరిగి తెరవాలంటూ భక్తులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ ప్రకటన చేశారు. కాగా, కరోనా బారినపడ్డ 400 మందిలో 9 మంది వైరస్ ధాటికి ప్రాణాలను కోల్పోయినట్లు తెలిపారు. ప్రస్తుతం 16 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వారు భువనేశ్వర్‌లోని కొవిడ్ ఆస్పత్రిలో చికి్త్సపొందుతున్నట్లు శ్రీ జగన్నాథ ఆలయ పర్యవేక్షణ, పాలన అధికారి అజయ్ కుమార్ జెనా వెల్లడించారు. ఇక, కరోనా సోకిన చాలా మంది ఆలయ సిబ్బంది హోం ఐసోలేషన్ లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని ఆయన వివరించారు. దీంతో ఆలయాన్ని తెరిచేందుకు సిబ్బంది కొరత ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతం పూరీ ఆలయం భక్తుల దర్శనాలను నిలిపివేసి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆలయ పూజారులు మాత్రం… నవంబర్ చివరి వరకూ ఆలయంలోకి భక్తులను అనుమతించకపోవడం మేలంటున్నారు. ఇదే విషయాన్ని నివేదిక రూపంలో ఒడిశా హైకోర్టుకు సమర్పించింది రాష్ట్ర సర్కార్. మొత్తం 822 మంది ఆలయ సిబ్బందికి కరోనా టెస్టులు జరిపినట్లు తెలిపింది. ఆలయాన్ని భక్తుల కోసం తెరిస్తే…. పూజారులు, సిబ్బంది, వారి కుటుంబాలు సహా… మొత్తం 2,200 మందిపై కరోనా ప్రభావం పడుతుందని అజయ్ కుమార్ వివరించారు. మరోవైపు, ప్రస్తుతం ఒడిశాలో 35,006 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ కరోనాతో 797 మంది చనిపోయారు.

యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..