బ్యాంకు ఉద్యోగుల‌ను వెంటాడుతోన్న క‌రోనా..ఒక బ్రాంచిలో 38 మందికి పాజిటివ్‌

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వ్యాప్తి ప్ర‌మాద‌క‌రంగా మారింది. పాజిటివ్ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరిగింది. ముందు వ‌రుస‌లో ఉండి సేవ‌లు అందించే క‌రోనా వారియ‌ర్స్ అధిక సంఖ్య‌లో కోవిడ్ బారిన ప‌డుతున్నారు.

బ్యాంకు ఉద్యోగుల‌ను వెంటాడుతోన్న క‌రోనా..ఒక బ్రాంచిలో 38 మందికి పాజిటివ్‌
Follow us

|

Updated on: Jul 26, 2020 | 11:45 PM

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వ్యాప్తి ప్ర‌మాద‌క‌రంగా మారింది. పాజిటివ్ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరిగింది. ముందు వ‌రుస‌లో ఉండి సేవ‌లు అందించే క‌రోనా వారియ‌ర్స్ అధిక సంఖ్య‌లో కోవిడ్ బారిన ప‌డుతున్నారు. బ్యాంకు సిబ్బందిని కూడా క‌రోనా క‌బ‌లిస్తోంది. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేసే అవ‌కాశం లేక‌పోవ‌డంతో మెజార్టీ సిబ్బంది బ్యాంకుల‌కు వెళ్ల‌క తప్ప‌డం లేదు. క్యాష్, ఫైళ్లు, చెక్స్, పాస్ బుక్స్ వంటివి ఇచ్చిపుచ్చుకోవడం వ‌ల్ల క‌రోనా వ్యాప్తి చెందుతోంది.

తాజాగా తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలోని ఓ కేంద్ర బ్యాంకు బ్రాంచిలో కరోనా బుస‌లు కొట్టింది. ఆ బ్రాంచిలో వ‌ర్క్ చేస్తోన్న‌ దాదాపు 38 మందికి మహమ్మారి సోకినట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. బ్యాంక్ ఎంప్లాయిస్ సామూహక టెస్టులు నిర్వహించిన తరువాత ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో బ్రాంచిని సందర్శించిన వినియోగదారులను కొవిడ్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. బ్యాంకులో శానిటైజేషన్ ప్రక్రియ కంప్లీట్ అయింద‌ని, అతి త్వ‌ర‌లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు బ్యాంకు సీనియర్ అధికారి పేర్కొన్నారు.