భయంకర కరోనా విజృంభణ.. చైనాలో 100 మందికి పైగా మృతి

కరోనా విజృంభిస్తోంది. అంతకంతకూ వ్యాపిస్తోంది. చైనా నుంచి వ్యాప్తి చెందిన ఈ మహమ్మారి.. ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చైనాలో కరోనా బారిన పడి 100 మందికి పైగా చనిపోయారు. వైరస్‌ తీవ్రత కారణంగా చైనా ఆర్థికశాఖ 9 బిలియన్‌ డాలర్లు ప్రకటించింది. మహమ్మారిని తరిమివేసేందుకు నడుంబిగించింది. మరో 2,744 మందికి వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు చైనా ఆరోగ్య సంస్థ గుర్తించింది. వీరిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉంది. చైనాలో అంతకంతకూ విజృంభిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా […]

భయంకర కరోనా విజృంభణ.. చైనాలో 100 మందికి పైగా మృతి
Follow us

| Edited By: Srinu

Updated on: Jan 28, 2020 | 1:46 PM

కరోనా విజృంభిస్తోంది. అంతకంతకూ వ్యాపిస్తోంది. చైనా నుంచి వ్యాప్తి చెందిన ఈ మహమ్మారి.. ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇప్పటికే చైనాలో కరోనా బారిన పడి 100 మందికి పైగా చనిపోయారు. వైరస్‌ తీవ్రత కారణంగా చైనా ఆర్థికశాఖ 9 బిలియన్‌ డాలర్లు ప్రకటించింది. మహమ్మారిని తరిమివేసేందుకు నడుంబిగించింది. మరో 2,744 మందికి వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు చైనా ఆరోగ్య సంస్థ గుర్తించింది. వీరిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉంది.

చైనాలో అంతకంతకూ విజృంభిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్‌.. ప్రపంచదేశాలకూ విస్తరిస్తోంది. చైనా వారిని వారి దేశాలకు రాకుండా.. వివిధ దేశాలు బ్యాన్ విధించాయి. తాజాగా.. థాయ్‌లాండ్‌లో 7కి, ఆస్ట్రేలియా, సింగపూర్‌లో 4కి, అమెరికాలో 3కి, జపాన్, మలేషియా, ఫ్రాన్స్ దేశాల్లో ఒక్కొక్కరికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే.. చైనా నుంచి ఇండియాకి వస్తోన్న వారిపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఈ వైరస్ లక్షణాలు లేనివారిని అనుమతిస్తున్నారు.

కాగా.. చైనా నుంచి ఇటీవలే ఓ బీహార్‌ యువతి భారత్‌కు తిరిగి వచ్చించి. 29 సంవత్సరాలున్న ఈమె చైనాలో పీహెచ్‌డీ చేసింది. ఈమె తండ్రి బీహార్‌లో ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఈ యువతి వచ్చిన రెండు రోజుల తర్వాత  దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్టు చెప్పింది. ఈ విషయాన్ని పూణెలోని ఆమె సోదరి వైద్య, కుటుంబ సంక్షేమ శాఖకు హెల్ప్‌లైన్‌ ద్వారా తెలియచేశారు. అమె కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు జరపాలని బీహార్‌ ఆరోగ్య శాఖ ఆదేశించింది.

మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో