Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 46 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 246628 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 120406 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 119293 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6929 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • తిరుపతి: రేపటి నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనాలు ప్రారంభం. ఎనభై రోజుల తరవాత ప్రారంభమవుతున్న దర్శనాలు. రేపు ఎల్లుండి ఉద్యోగులతో ట్రయల్ రన్ ద్వారా దర్శనాలు. పదో తేదీ తిరుమల పై ఉన్న స్థానికులకు దర్శనాలు. 11వతీదీ నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభం. జూన్ నెలకు ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలు రేపటి నుంచి టిటిడి వెబ్ సైట్ లో లభ్యం. ఆఫ్ లైన్లో తిరుపతిలోని కౌంటర్లలో టికెట్లు లభ్యం. అలిపిరి నడక మార్గం నుంచి భక్తులు వెళ్లేందుకు అనుమతి. కాణిపాకం దేవాలయంలో రేపటి నుంచి ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్. పదో తేదీ నుంచి గంటకు మూడువందలమంది వరకూ భక్తులకు దర్శనాలు. శ్రీకాళహస్తిలో దేవాలయం రెడ్ జోన్ లో ఉండటం వల్ల ప్రస్తుతానికి దర్శనాలు ప్రారంభించడం లేదని ప్రకటించిన అధికారులు.
  • నిమ్స్ లోని 5 విభాగాలు 7 నుండి9 వ తేదీ వరకు ముత పడనున్నాయ్. పాజిటివ్ వచ్చిన వారూ పనిచేసిన విభాగాలను శానిటేషన్ చేయనున్న హాస్పిటల్ సిబ్బంది ghmc. ముత పడనున్న 5 విభాగాలు: మెడ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, కార్డియాలజీ & సర్జికల్ ఆంకాలజీ.
  • గ్రేటర్ మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించడం గందరగోళంగా మారుతుందని భావించిన ప్రభుత్వం... గ్రేటర్ లోనే సగంమంది 10th విద్యార్థులు. సప్లమెంటరీ రాసిన విద్యార్థులకు ఇంటర్ అడ్మిషన్లు దొరకడం కష్టమనే అభిప్రాయానికి వచ్చిన సర్కార్ . అందరికి ఒకేసారి పరీక్షలు నిర్వహించాలనే యోచలనలో ప్రభుత్వం.
  • విజయవాడ: గ్యాంగ్ వార్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. డీసీపీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో విచారణ.. సందీప్ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. 13 మంది నిందితులను విచారిస్తున్న పోలీసులు.. ల్యాండ్ సెటిల్మెంట్ వివాదమే కారణమని గుర్తింపు.. ధనేకుల శ్రీధర్, ప్రతాప్ రెడ్డి డి నాగబాబులను విచారిస్తున్న పోలీసులు.. మంగళగిరి కి చెందిన ఇద్దరు రౌడిసీటర్ల ఉన్నట్టు గుర్తింపు.. టెక్నాలజీ సహాయంతో కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితుల పండు తల్లిని పాత్రపై విచారిస్తున్న పోలీసులు..
  • అమరావతి: ఈనెల 16 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం. 18న బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్. కోవిడ్ నేపథ్యంలో 14 రోజులు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలు కుదించే అవకాశం. ఈనెల 31తో ముగియనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.

మహాసంగ్రామంలో కాషాయ పార్టీలు కలుస్తాయా.. కలబడతాయా..?

Our Alliance With BJP in Maharashtra Assembly Polls a Certainty.. Says Shiv Sena Secretary, మహాసంగ్రామంలో కాషాయ పార్టీలు కలుస్తాయా.. కలబడతాయా..?

సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఆర్నెల్లు కూడా గడవలేదు.. అప్పుడే మిని సంగ్రామాని కమల దళం రెడీ అవుతోంది. మహారాష్ట్ర, హరియాణాలతోపాటు ఢిల్లీ, జార్ఖండ్‌ అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అయితే దీపావళి పండుగకు ముందే.. మహారాష్ట్ర, హరియాణాలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అంతేకాదు.. వీటికి సంబంధించి ఇవాళ నోటీఫికేషన్ కూడా విడుదల కాబోతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. అయితే మరి ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి ఎంటన్న చర్చ మొదలైంది. రెండు కూడా హిందుత్వ ఓటు బ్యాంకుతో కూడిన పార్టీలు కావడంతో.. ఈ ఇరు పార్టీల మధ్య పొత్తు ప్రతీ సారి ఆసక్తి రేపుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని అంతా భావించినా.. చివరి క్షణంలో ఎవరికి వారే బరిలోకి దిగారు. ఆ తర్వాత బీజేపీ అధిక సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టింది. అయితే ఆ తర్వాత మళ్లీ శివసేన, బీజేపీల మధ్య స్నేహం కుదిరింది. మళ్లీ సార్వత్రిక ఎన్నికలు సమీపించే వేళ.. శివసేన చీఫ్ బీజేపీపై విమర్శలు చేయడం ప్రారంభించారు. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి వారే పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా అమిత్ షా రంగంలోకి దిగడంతో సీన్ ఛేంజ్ అయ్యింది. అమిత్ షా.. సీఎం ఫడ్నవీస్.. ఉద్దవ్ ఠాకూర్‌తో కలిసి భేటీ అయ్యారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నామని ప్రకటించారు. మొత్తం 48 సీట్లలో బీజేపీ 25, శివసేన 23 స్థానాలను పంచుకున్నాయి. అయితే ఆ సమయంలోనే అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన కూడా పార్టీ శ్రేణుల్లో వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 50-50 శాతం సీట్ల పంపకాలు ఉండేలా చూడాలని నిర్ణయించుకున్నారు. అయితే అనుకున్నట్లే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపించాయి. అయితే ఇప్పుడు కాషాయ పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయా..? లేక కలబడనున్నాయా..? అన్నదానిపై ఉత్కంఠ రేగుతోంది.

అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోతుందని శివసేన కార్యదర్శి అనిల్ దేశాయి తెలిపారు. సెప్టెంబరు 22న భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ముంబయికి రానున్నారని, ఈ సందర్భంగా పొత్తు ప్రకటన ఉంటుందని ఆయన తెలిపారు. సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో అనిల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఎన్నికల పొత్తు విషయమై శివసేన ఇప్పటికే ఓ రాజీ ఫార్ములాను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆ ప్రకారం మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను, శివసేన 135 సీట్లలో పోటీ చేయనుంది. ఇక బీజేపీ 153 సీట్లలో పోటీకి దిగనుంది. అయితే బీజేపీకి 153 సీట్లు కేటాయించినా.. ఆ సీట్లలో 18 స్థానాలను కూటమిలోని చిన్న పార్టీలైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా,రాష్ట్రీయ సమాజ్ పక్షా, శివ సంగ్రామ్‌ పార్టీలకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ ఫార్ములా ప్రకారం రెండు పార్టీలు చెరో 135 సీట్లలో పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫార్ములాతో పాటు.. మరోవైపు అసలు పొత్తులు కుదరకపోతే అప్పుడు ఉం చేయాలన్న దానిపై కూడా ప్లాన్లు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన సీన్ రిపీట్ అయితే.. అప్పుడు అన్ని స్థానాల్లో పోటీ చేయాల్సి వస్తుంది. మరి అప్పుడు 288 మంది అభ్యర్థులను ఎవరెవరిని బరిలో దింపాలన్నదానిపై కూడా ప్లాన్లు వేస్తున్నారని తెలుస్తోంది.

అయితే శివసేన కీలక నేతల్లో ద్వందాభిప్రాయాలున్నాయి. ఒకరు 50-50 ఒప్పదం ఉండాలనుకుంటుంటే.. మరోకరు సగానికి పైగా సీట్లను శివసేనాకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అటు బీజేపీ నేతలు కొందరు ఒంటరిగా పోటీ దిగాలన్న అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు. గత అయిదేళ్లలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిందని.. కాబట్టి ప్రజాక్షేత్రంలో సత్తా చాటొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు పొత్తు కుదురుతుందా.. లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.

Related Tags