ఓటీటీ నటీనటుల కొత్త డిమాండ్, తమకు కూడా గుర్తింపు ఇవ్వాలని విన్నపం

మూత పడిన థియేటర్ల ప్లేస్‌లో ఓటీటీ మార్కెట్‌ ఊపందుకుంది. థియేట్రికల్ రిలీజ్‌ అంత భారీగా కాకపోయినా..

  • Ram Naramaneni
  • Publish Date - 3:41 pm, Sun, 29 November 20
ఓటీటీ నటీనటుల కొత్త డిమాండ్, తమకు కూడా గుర్తింపు ఇవ్వాలని విన్నపం

మూత పడిన థియేటర్ల ప్లేస్‌లో ఓటీటీ మార్కెట్‌ ఊపందుకుంది. థియేట్రికల్ రిలీజ్‌ అంత భారీగా కాకపోయినా.. ఓటీటీలతో డీసెంట్‌ బిజినెస్‌ జరుగుతోంది. దీంతో ప్రొడ్యూసర్స్ హ్యాపీ.. తమ కంటెంట్‌ ఏదో ఒక ప్లాట్‌ ఫాంలో ఆడియన్స్‌కు అయితే రీచ్‌ అయ్యింది కాబట్టి మేకర్స్ కూడా హ్యాపీ.. కానీ ఈ విషయంలో ఆర్టిస్ట్‌ లు మాత్రం అంత హ్యాపీగా లేరు. అంతే కాదు కొత్త డిమాండ్‌లను కూడా ఇండస్ట్రీ ముందు పెడుతున్నారు కొంత మంది ఓటీటీ స్టార్స్‌.

ఓటీటీ రిలీజ్ అంటే కమర్షియల్ ఫార్ములాను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అందుకే ‘జర హట్కే సోచో’ అన్నట్టుగా ఛాలెంజింగ్ కంటెంట్‌ను ట్రై చేస్తున్నారు మేకర్స్‌. ఆర్టిస్ట్‌లు కూడా ఛాలెంజ్‌ యాక్సెప్టెడ్‌ అన్నట్టుగా డిఫరెంట్ రోల్స్‌కు సై అంటున్నారు. ఎప్పుడూ… రొటీన్ క్యారెక్టర్స్‌ లో కనిపించే స్టార్స్‌కు వేరియేషన్స్‌ చూపించే ఛాన్స్‌ రావటంతో…. హ్యాపీగా ఫీలవుతున్నారు. అంతా ఓకే మరి కంప్లయింట్‌ ఏంటి అనుకుంటున్నారా..?

అక్కడే వచ్చింది అసలు సమస్య.. సిల్వర్‌ స్క్రిన్‌ మీద సూపర్బ్ పర్ఫామెన్స్‌ చూపిస్తే అవార్డులు… రివార్డులు క్యూ కడతాయి.. కానీ ఓటీటీకి ఆ ఛాన్స్ చాలా తక్కువ.. ఏ రేంజ్‌లో పర్ఫామెన్స్ ఇచ్చినా సోషల్ మీడియా ప్రైజింగ్ తప్ప.. అవార్డుల ఊసే ఉండదు.. అందుకే ఓటీటీలను కూడా అవార్డ్స్‌ విషయంలో కన్సిడర్‌ చేయాలంటున్నారు స్టార్స్‌. అలా చేస్తే బెస్ట్ పర్ఫామెన్స్‌కు సరైన గుర్తింపు దక్కుతుందన్నది వాళ్ల ఒపీనియన్‌.. ఇప్పటికే కొన్ని స్టేజ్‌ల మీద వెబ్‌ మూవీస్‌కు కూడా అవార్డులు ఇస్తున్నారు.. మరీ కొత్త డిమాండ్‌లతో అన్ని అవార్డ్స్‌ ఫంక్షన్స్‌లోనూ డిజిటల్‌ కంటెంట్‌కు కూడా ప్లేస్‌ ఇస్తారేమో చూడాలి మరి.

అమిత్ షా ప్రెస్ మీట్ లైవ్ వివరాల కోసం దిగువ లింక్ క్లిక్ చెయ్యండి  :