Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక పరీక్షా ఫలితాలు ‘మొబైల్ యాప్’లో..!

Osmania University introduced mobile app to view exam results, విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక పరీక్షా ఫలితాలు ‘మొబైల్ యాప్’లో..!

ఓయూ విద్యార్థులకు శుభవార్త. ఉస్మానియా వర్సిటీ విడుదల చేసే పరీక్షల ఫలితాలు ఇక నుంచి యాప్‌లో చూసుకునే వెసులుబాటును ఓయూ కల్పించనుంది. ‘ఓయూ స్టూడెంట్‌’ అనే యాప్‌ సాయంతో ఫలితాలు తెలుసుకోవచ్చు. యాప్‌ ద్వారా ఫలితాలు తెలుసుకునే సౌకర్యాన్ని శుక్రవారం విడుదల చేసిన డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాల ద్వారా ఓయూ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతి సెమిస్టర్‌లో సుమారు 80 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు. పరీక్షల ఫలితాలను నేరుగా ఉస్మానియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతుంది. అనంతరం అరగంట తర్వాత ఇతర వెబ్‌సైట్లలోనూ అందుబాటులోకి తీసుకొస్తుంది.

ఎగ్జామ్ రిజల్ట్స్ సమయంలో వేల మంది విద్యార్థులు ఒకేసారి ఉస్మానియా వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూస్తుండటంతో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వర్సిటీకి సాంకేతిక సాయం అందిస్తున్న సైబర్‌ హైట్స్‌ అనే సంస్థ ‘ఓయూ స్టూడెంట్‌’ మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు వారి హాల్‌టికెట్, మొబైల్‌ నంబరుతో యాప్‌లో రిజిస్టర్‌ చేసుకుని ఫలితాలు అరచేతిలో చూసుకోవచ్చు. అలాగే మార్కుల మెమోలు కూడా సేవ్‌ చేసుకునే సౌలభ్యం కల్పించారు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు, ఓయూ అనుబంధ కళాశాలలకు ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతోనే యాప్‌లోనూ ఫలితాలు విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొ.శ్రీరాం వెంకటేశ్‌ తెలిపారు.

Related Tags