టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ ప్రదర్శితమైన ‘జల్లికట్టు’ మూవీ ! మలయాళ చిత్రసీమకు ‘వరం’ కానుందా ?

మలయాళ దర్శకుడు లిజో జోస్ డైరెక్ట్ చేసిన ‘జల్లికట్టు’ చిత్రాన్ని  ఆస్కార్ అవార్డులకు సంబంధించి… ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి ఇండియా తరఫున ఎంట్రీగా ఎంపిక చేసింది.

  • Umakanth Rao
  • Publish Date - 8:36 pm, Wed, 25 November 20

మలయాళ దర్శకుడు లిజో జోస్ డైరెక్ట్ చేసిన ‘జల్లికట్టు’ చిత్రాన్ని  ఆస్కార్ అవార్డులకు సంబంధించి… ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి ఇండియా తరఫున ఎంట్రీగా ఎంపిక చేసింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ముఖ్యంగా తమిళనాడులో పాపులర్ అయిన జల్లికట్టు క్రీడా  సందర్భంగా సక్సెస్ అయింది. లోగడ టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లోను, బూసాన్ చిత్రోత్సవం లో కూడా ఈ మూవీని ప్రదర్శించారు. ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, శాంతి బాలచంద్రన్, జఫర్ ఇదుక్కి తదితర స్టార్స్ ఈ చిత్రంలో నటించారు. ‘మావోయిస్ట్’ అనే పేరిట రైటర్  ఎస్.హరీష్  రాసిన షార్ట్ స్టోరీ ఆధారంగా ‘జల్లికట్టు’ మూవీని నిర్మించారు. ఇది ఆస్కార్ కు ఎంపిక కావడం మలయాళ చిత్రసీమకు వరం కావచ్ఛునని భావిస్తున్నారు.