కరోనా గుప్పిట్లో దేశం.. నగరాలన్నింటినీ ‘దిగ్బంధం’ చేయండి.. పి.చిదంబరం

వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్  ను అదుపు చేసేందుకు దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలను రెండు వారాల నుంచి 4 వారాల పాటు 'దిగ్బంధం'

కరోనా గుప్పిట్లో దేశం.. నగరాలన్నింటినీ 'దిగ్బంధం' చేయండి.. పి.చిదంబరం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 19, 2020 | 5:58 PM

వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్  ను అదుపు చేసేందుకు దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలను రెండు వారాల నుంచి 4 వారాల పాటు ‘దిగ్బంధం’ (లాక్ డౌన్) చేయాలనీ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం.. ప్రభుత్వాన్ని కోరారు. ఇలా చేయడంవల్ల కొంతలో కొంతయినా దీన్ని కంట్రోల్ చేయగలుగుతామని ఆయన అన్నారు. కరోనా అనుమానిత కేసులను వెంటనే ఐసొలేట్ చేయాలని, ఈ వైరస్ తో కాంటాక్ట్ ఉందని భావించిన ప్రతి వ్యక్తికీ తప్పనిసరిగా టెస్టులు చేయించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరించిందని, అలాగే అన్ని దేశాల్లో నగరాలను, పట్టణాలను రెండు వారాలు లేదా నాలుగు వారాలు గానీ దిగ్బంధం చేయాలని  కూడా సూచించిందని ఆయన ట్వీట్ చేశారు. మన ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలన్నారు. ఇటలీ, స్పెయిన్, ఇరాన్ వంటి దేశాల్లో ఏం జరుగుతోందో మనం చూస్తున్నాం.. ఇంకా జాప్యం చేయడం ఎందుకు అని చిదంబరం ప్రశ్నించారు. మీనమేషాలు లెక్కపెట్టడం తగదన్నారు.

 100 బిలియన్ డాలర్ల రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించిన ట్రంప్

అమెరికాలో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 113 కి చేరుకుంది. దాదాపు 9 వేల మందికి ఈ వ్యాధి పాజిటివ్ లక్షణాలు కనిపిచినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలోని ఉద్యోగులందరికీ 10 రోజుల పెయిడ్ లీవును ఇస్తున్నామని, కరోనా అనుమానితులకు ఉచితంగా టెస్టులు జరుగుతాయని ట్రంప్ పేర్కొన్నారు. ఆయన ప్రకటించిన కరోనా రిలీఫ్ ప్యాకేజీకి సెనేట్ లో 90 మంది సభ్యుల మద్దతు లభించింది. ఈ బిల్లును కేవలం 8 మంది వ్యతిరేకించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 9 వేల మందికి పైగా కరోనా వ్యాధిగ్రస్థులు మరణించారు.  ఒక్క ఇటలీలోనే  2,900 మంది మృత్యువాత పడగా.. 35 వేల కేసులు నమోదయ్యాయి.

ఇరాన్ లో చిక్కుబడిన 255 మందిభారతీయులకు కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయని, 17 వేల కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. బ్రిటన్, మలేసియా, ఫ్రాన్స్ తదితర దేశాల్లో కరోనా తీవ్రత ఇంకా కొనసాగుతోంది.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.