కరోనా డ్రగ్ తయారీలో.. ఆప్టిమస్‌ ఫార్మా‌కు డీసీజీఐ ఆమోదం..

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రపంచ దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఆప్టిమస్‌ ఫార్మా మార్కెట్లోకి యాంటీవైరల్‌ ఔషధం

కరోనా డ్రగ్ తయారీలో.. ఆప్టిమస్‌ ఫార్మా‌కు డీసీజీఐ ఆమోదం..
2-deoxy-D-glucose
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2020 | 12:44 PM

Optimus Pharma gets DCGI approval: దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రపంచ దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఆప్టిమస్‌ ఫార్మా మార్కెట్లోకి యాంటీవైరల్‌ ఔషధం ‘ఫావిపిరవిర్‌’ 200 ఎంజీ టాబ్లెట్లను విడుదల చేసింది. ఫావిపిరవిర్‌.. ఏపీఐ తయారీకి అనుబంధ సంస్థ ఆప్‌ట్రిక్స్ లేబొరేటరీస్ కు, ‘ఫావికొవిడ్‌ 200’ బ్రాండ్‌తో ఫావిపిరవిర్‌ను విక్రయించేందుకు ఆప్టిమస్ కు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చిందని కంపెనీ డైరెక్టర్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని యూనిట్‌లో ఆప్టిమస్‌ ఈ ఔషధాలను ఉత్పత్తి చేయనుంది.

Also Read: హైదరాబాద్‌కు మరో ఘనత.. దేశంలోనే మొదటి స్థానం..