ఈసీతో వార్‌కు సై..

ఈవీఎంల కేంద్రంగా రాజకీయం మరింత హీటెక్కింది. ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ ముద్దు అంటూ బీజేపీయేతర పక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో సమావేశమై.. ఈసీ తీరును ఏకగ్రీవంగా తప్పుబట్టాయి. అధికార పార్టీకి రెడ్ కార్పెట్.. విపక్షాలకు రెడ్ సిగ్నల్ ఇస్తోందంటూ ఎన్నికల సంఘంపై ముప్పేట దాడి చేస్తున్నాయి. వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందేనంటూ విపక్షాలు పట్టుబడుతుంటే.. సాధ్యం కాదంటూ ఈసీ చెప్పుకొచ్చింది. ఎందుకు సాధ్యం కాదో చెప్పాలంటూ విపక్షాలు ఈసీని ప్రశ్నించాయి. అటు.. వీవీప్యాట్ స్లిప్పుల […]

ఈసీతో వార్‌కు సై..
Follow us

| Edited By:

Updated on: Apr 16, 2019 | 4:58 PM

ఈవీఎంల కేంద్రంగా రాజకీయం మరింత హీటెక్కింది. ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ ముద్దు అంటూ బీజేపీయేతర పక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో సమావేశమై.. ఈసీ తీరును ఏకగ్రీవంగా తప్పుబట్టాయి. అధికార పార్టీకి రెడ్ కార్పెట్.. విపక్షాలకు రెడ్ సిగ్నల్ ఇస్తోందంటూ ఎన్నికల సంఘంపై ముప్పేట దాడి చేస్తున్నాయి.

వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందేనంటూ విపక్షాలు పట్టుబడుతుంటే.. సాధ్యం కాదంటూ ఈసీ చెప్పుకొచ్చింది. ఎందుకు సాధ్యం కాదో చెప్పాలంటూ విపక్షాలు ఈసీని ప్రశ్నించాయి. అటు.. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై కూడా సుప్రీం కోర్టు ఈసీపై కొరడా ఝుళిపించింది.

వీవీప్యాట్ స్లిప్పులు 50 శాతం లెక్కిస్తే.. ఈసీకి ఉన్న అభ్యంతరమేంటో చెప్పాలన్నారు చంద్రబాబు.  ఏపీలో 150 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంటామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.