వ్యవసాయ బిల్లులపై హీట్ పెంచుతున్న విపక్షం

వ్యవసాయ బిల్లుపై పోరాటంను విపక్షం మరింత ఉధృతం చేస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అన్ని మార్గాలను విపక్షం ఉపయోగించుకుంటోంది. వ్యవసాయ బిల్లులపై సంతకం చేయవద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు కాసేపట్లో వినతిపత్రం ఇవ్వబోతున్నారు

వ్యవసాయ బిల్లులపై హీట్ పెంచుతున్న విపక్షం
Follow us

|

Updated on: Sep 23, 2020 | 6:15 PM

వ్యవసాయ బిల్లుపై పోరాటంను విపక్షం మరింత ఉధృతం చేస్తోంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అన్ని మార్గాలను విపక్షం ఉపయోగించుకుంటోంది. వ్యవసాయ బిల్లులపై సంతకం చేయవద్దని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు కాసేపట్లో వినతిపత్రం ఇవ్వబోతున్నారు విపక్ష ఎంపీలు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఇవాళ కూడా లోక్‌సభ కార్యకలాపాలను బహిష్కరించింది విపక్షం.

ఓటింగ్‌ నిర్వహించకుండానే బిల్లులను ఆమోదించారని పార్లమెంట్‌ ఆవరణలో నిరసన కొనసాగించారు. గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు విపక్ష ఎంపీలు ర్యాలీ తీశారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు కూడా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

15 పార్టీలకు చెందిన ఎంపీలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఈ పార్టీలు రాష్ట్రపతికి వినతిపత్రం ఇస్తున్నాయి. save farmers .. save contry ప్లకార్డులను ప్రదర్శించారు.

మరోవైపు రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. కరోనా విజృంభణ కారణంగా సమావేశాలను 10 రోజుల ముందే వాయిదా వేస్తునట్టు ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు వెల్లడించారు.