న్యూ మొబైల్… ఒప్పో నుంచి మరో సరికొత్త ప్రొడక్ట్… ధర ఎంతంటే… ఏ ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా..?

ఒప్పో మొబైల్ కంపెనీ నూతన ప్రొడక్ట్‌ను విడుదల చేసింది. అక్టోబర్‌లో లాంచ్ చేసిన ఒప్పో ఎ15కి కొనసాగింపుగా ఒప్పో ఎ15ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది.

న్యూ మొబైల్... ఒప్పో నుంచి మరో సరికొత్త ప్రొడక్ట్... ధర ఎంతంటే... ఏ ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా..?
Follow us

| Edited By:

Updated on: Dec 17, 2020 | 7:07 AM

ఒప్పో మొబైల్ కంపెనీ నూతన ప్రొడక్ట్‌ను విడుదల చేసింది. అక్టోబర్‌లో లాంచ్ చేసిన ఒప్పో ఎ15కి కొనసాగింపుగా ఒప్పో ఎ15ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఒప్పో ఎ15ఎస్, ఒప్పో ఎ15 సమానమైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. డిసెంబర్‌ 21 నుంచి ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా, రిటైల్‌ ఔట్‌లెట్ల ద్వారా ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. ఒప్పోఎ15ఎస్ 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ మోడల్‌ ధర రూ.11,490. ఇది డైనమిక్ బ్లాక్, ఫ్యాన్సీ వైట్ మరియు రెయిన్ బో సిల్వర్ అనే మూడు రంగులలో లభిస్తుంది.

ఫీచర్లు ఇవే…

ఒప్పో ఎ15ఎస్ కలర్ ‌ఓఎస్ 7.2పై నడుస్తుంది. ఇది 6.52-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను 89 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పీ 35 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఒప్పో ఎ15ఎస్ 64 జీబీ స్టోరేజ్‌, 4 జీబీ ర్యామ్‌ ఆప్షన్ లలో మాత్రమే లభిస్తుంది. ఒప్పో ఎ15ఎస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీనిలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇది 4,230 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో సపోర్ట్ తో వస్తుంది. హెచ్‌డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. ఐసీఐసీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఫెడరల్‌ బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 5శాతం క్యాష్‌బ్యాక్‌ అభించనుంది. ఈ ఆఫర్లు డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 25 వరకు మాత్రమే చెల్లుతాయి.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..