RUSSIAN EXPORTS: ఇంధన ఎగుమతుల్లో రష్యా జోరు.. ఏ మాత్రం ప్రభావం చూపని ఆంక్షలు.. యూరోపియన్ దేశాల ద్వంద్వ వైఖరి

ఫిన్‌ల్యాండ్ దేశానికి చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఏయిర్ నివేదిక వెల్లడించింది. ఈ సంస్థకు చెందిన విశ్లేషకుడు లారీ మైల్లీవిర్టా వెల్లడించిన వివరాల ప్రకారం రష్యా నుంచి దిగుమతి చేసుకున్న వాటిలో దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా కాకుండా తక్షణ సరఫరా ఒప్పందాలే ఎక్కువగా వున్నాయని తెలుస్తోంది.

RUSSIAN EXPORTS: ఇంధన ఎగుమతుల్లో రష్యా జోరు.. ఏ మాత్రం ప్రభావం చూపని ఆంక్షలు.. యూరోపియన్ దేశాల ద్వంద్వ వైఖరి
18
Rajesh Sharma

|

Jun 13, 2022 | 5:35 PM

RUSSIAN EXPORTS INCREASED IN RECENT DAYS AMERICAN EUROPEAN COUNTRIES SANCTIONS FUTILE: యావత్ ప్రపంచం వ్యతిరేకించినా రష్యా వెనక్కి తగ్గలేదు. ఉక్రెయిన్ మెడలు వంచేందుకు స్పెషల్ మిలిటరీ యాక్షన్ (SPECIAL MILITARY ACTION BY RUSSIA) మొదలు పెట్టి వంద రోజులకు పైగా అయినా, ప్రత్యేక సైనిక చర్య ద్వారా మిలిటరీ పరంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతున్నా రష్యా (RUSSIA) వెనక్కి తగ్గడం లేదు. అమెరికా (AMERICA) సహా పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినా రష్యా ఏ మాత్రం ఖాతరు చేయలేదు. పలు దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థ భారీ ఎత్తున దెబ్బతింటుందని పలువురు అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు భావించారు. కానీ ఈ అంచనాలకు భిన్నంగా రష్యా ఆర్థికంగా మరింత బలోపేతం అయ్యిందని తాజా నివేదికలు చాటుతున్నాయి. ఇలా జరగడానికి కారణం ఎవరు అంటే రష్యా సైనిక చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన యూరోపియన్ యూనియన్ (EUROPEAN UNION) దేశాలే రష్యా ఆదాయం భారీగా పెరగడానికి కారణమని ఈ నివేదికల సారాంశం కావడం ఆశ్చర్యం కలిగించక మానదు. ఫిబ్రవరి 24న రష్యా.. ఉక్రెయిన్‌లో సైనిక చర్య ప్రారంభించింది. ఆ వెంటనే అమెరికా సారథ్యంలోని నాటో (NATO) కూటమి దేశాలు సహా సుమారు 150 దేశాలు రష్యా చర్యను ఎండగట్టాయి. ఉక్రెయిన్‌లో సైనిక చర్యను వెంటనే ఆపాలని రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్‌ (RUSSIAN PRESIDENT PUTIN)ను కోరాయి. తమ మాటలను బేఖాతరు చేసిన రష్యాపై ఆర్థిక ఆంక్షలతో విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా రష్యా బ్యాంకులు, పుతిన్ వ్యక్తిగత, బంధువులు, సన్నిహిత కంపెనీల ఖాతాలను స్థంభింపజేశాయి. రష్యా నుంచి ఏ వస్తువును దిగుమతి చేసుకోకూడదని నిర్ణయించాయి. ఈ చర్యలన్నీ రష్యాను ఆర్థికంగా కుంగదీస్తాయని ఆంక్షలు విధించిన దేశాలతోపాటు చాలా దేశాలు భావించాయి. కానీ వంద రోజుల తర్వాత పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఇందుకు ఫిన్‌ల్యాండ్ (FINLAND) దేశానికి చెందిన సీఆర్ఈఏ (CREA).. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఏయిర్ తాజా నివేదికనే నిదర్శనంగా నిలుస్తోంది. రష్యా ఎగమతులకు అమెరికా, పోలండ్ (POLAND) వంటి దేశాలు పెద్ద ఎత్తున గండి కొట్టినా.. చైనా (CHINA), జర్మనీ (GERMANY), ఇటలీ (ITALY),భారత్ (BHARAT) వంటి దేశాలు రష్యన్ దిగుమతులను పెంచడంతో రష్యాకు పెద్ద ఎత్తున ఆదాయ వనరులు సమకూరాయి. ఇందులో ఆశ్చర్యకరం ఏంటంటే రష్యా నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకున్న దేశాల్లో రెండు, మూడో స్థానంలో వున్న దేశాలు జర్మనీ, ఇటలీ యూరోపియన్ దేశాలు కావడమే. స్పెషల్ మిలిటరీ యాక్షన్ ప్రారంభించిన వెంటనే పలు ఈస్టర్న్ కంట్రీస్ రష్యాపై భారీ ఆంక్షలు విధించాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంలో కీకలమైన ముడి చమురు , నేచురల్ గ్యాస్ రంగాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ఆంక్షలను తోసిరాజన్న రష్యా.. సైనిక చర్య ప్రారంభమైన ఫిబ్రవరి 24 నుంచి వంద రోజుల తర్వాత ఒక్క ఇంధన ఎగుమతుల ద్వారానే 97.5 బిలియన్ల అమెరికన్ డాలర్ల మేరకు ఆదాయాన్ని ఆర్జించింది. రష్యా నుంచి జరిగిన ఇంధన ఎగుమతుల్లో 61 శాతం ఉక్రెయిన్లో సైనిక చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన యూరోపియన్ దేశాలకే జరగడం చెప్పుకోదగిన అంశం. మొత్తం ఇంధన ఎగుమతుల ద్వారా రష్యా 97.5 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని పొందగా.. అందులో యూరోపియన్ దేశాల నుంచి 60 బిలియన్ అమెరికన్ డాలర్లను మాస్కో ఆర్జించింది. ఈ వివరాలను ఫిన్‌ల్యాండ్ దేశానికి చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఏయిర్ నివేదిక వెల్లడించింది. ఈ సంస్థకు చెందిన విశ్లేషకుడు లారీ మైల్లీవిర్టా వెల్లడించిన వివరాల ప్రకారం రష్యా నుంచి దిగుమతి చేసుకున్న వాటిలో దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా కాకుండా తక్షణ సరఫరా ఒప్పందాలే ఎక్కువగా వున్నాయని తెలుస్తోంది.

రష్యా నుంచి గత వంద రోజుల్లో ఇంధన దిగుమతి చేసుకున్న దేశాలలో చైనా తొలి స్థానంలో వుంది. ఆ దేశం 13.20 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఇంధనాన్ని దిగుమతి చేసుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో వున్న జర్మనీ 12.68 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు, మూడో స్థానంలో వున్న ఇటలీ 8.17 బిలియన్‌ అమెరికన్ డాలర్ల మేరకు ఇంధన దిగుమతులు చేసుకున్నాయి. భారత్‌ 3.56 బిలియన్‌ అమెరికన్ డాలర్ల మేర ఇంధనాన్ని కొనుగోలు చేసింది. మరో వైపు రష్యా ఆదాయానికి పోలాండ్‌, అమెరికాలు భారీగా దెబ్బకొట్టాయి. లిథువేనియా, ఫిన్లాండ్, ఎస్తోనియా తదితర దేశాలు 50 శాతానికిపైగా రష్యన్‌ దిగుమతులను తగ్గించాయి. క్రెమ్లిన్‌ ఇంధన ఎగుమతుల ఆదాయంలో అధిక శాతం క్రూడ్ ఆయిల్‌ నుంచి వచ్చింది. దీని విలువ దాదాపు 48.2 బిలియన్‌ అమెరికన్ డాలర్లు. ఆ తర్వాతి స్థానాల్లో పైప్‌లైన్ గ్యాస్, చమురు ఉత్పత్తులు, లిక్విడ్ నేచురల్ గ్యాస్ (LIQUID NATURAL GAS), కోల్ అమ్మకాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌ (UKRAINE)పై ప్రత్యేక సైనిక చర్య కారణంగా అనేక దేశాలు రష్యా నుంచి జరిగే దిగుమతులపై ఆంక్షలు విధించాయి. సైనిక చర్యకు ముందు సమయంతో పోల్చితే మే నెలలో దిగుమతులు 15 శాతం మేర తగ్గాయి. దీనికితోడు సబ్సిడీ ధరలకు సరఫరా చేయడంతో మే నెలలో రష్యాకు రోజుకు సుమారు 209 మిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు ఆదాయానికి గండి పడింది. అయినప్పటికీ.. ఇంధన డిమాండ్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరల్లో పెరుగుదలతో క్రెమ్లిన్ ఖజానా నిండుతూనే ఉంది. ఎగుమతి ఆదాయాలు రికార్డు స్థాయికి చేరాయి. సీఆర్‌ఈఏ నివేదిక ప్రకారం.. రష్యా సగటు ఎగుమతి ధరలు గత ఏడాది కన్నా 60 శాతం ఎక్కువగా ఉన్నాయి. అయితే.. జూన్ ప్రారంభంలో.. రష్యా చమురు దిగుమతులను చాలావరకు నిలిపేసేందుకు యూరోపియన్ యూనియన్ అంగీకరించింది. ఈ ఏడాది గ్యాస్ రవాణాను మూడింట రెండొంతుల మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మాస్కో ఆదాయంపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది.

నిజానికి రష్యా, ఉక్రెయిన్ కాంఫ్లిక్ట్ (UKRAINE CONFLICT) నేపథ్యంలో ఇండియా (INDIA) మాస్కో (MOSCOW)ను వ్యతిరేకించకపోవడాన్ని తొలి రోజుల్లో యూరోపియన్ దేశాలు తప్పుపట్టాయి. ఓ దశలో అమెరికా ఇండియాపై కూడా ఆంక్షలు విధించే అవకాశాలున్నాయని ప్రకటించింది. అయితే అమెరికా, యూరోపియన్ దేశాలు చెబుతున్న మాటలకి, చేపడుతున్న చర్యలకు పొంతన లేదన్న అంశాన్ని ఇండియన్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ప్రొ. జయశంకర్ సమర్థవంతంగా తిప్పికొట్టారు. యూరోపియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తూనే తమ అవసరాల కోసం భారీ ఎత్తున ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్నాయని, అలాంటి దేశాలు ఇండియా వైఖరిని ఎలా తప్పు పడతాయని విదేశాంగ శాఖ మంత్రి అంతర్జాతీయ వేదికలలో ఎండగట్టారు. యూరోపియన్ దేశాలు రష్యానుంచి దిగుమతి చేసుకుంటున్న ఇంధనంలో చాలా కనిష్ట శాతం మాత్రమే భారత్ దిగుమతి చేసుకుంటుందని ఆయన గణాంకాలను వెల్లడించారు. ఇండియా ఒక నెలలో దిగుమతి చేసుకున్న ఇంధనాన్ని యూరోపియన్ దేశాలు ఒక్క పూటలో దిగుమతి చేసుకుంటున్నాయంటూ ప్రొ.జయశంకర్ వెల్లడించిన గణాంకాలతో అమెరికా, సహా యూరోపియన్ దేశాలు కంగుతిన్నాయి. ఇక తాజాగా యూరోపియన్ దేశాల ద్వంద్వ విధానం మరోసారి బహిర్గతమైంది. ఉక్రెయిన్ దేశంలో రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ ఆంక్షలు ప్రకటించిన ఈయూ దేశాలు.. తాము విధించిన ఆంక్షలకు భిన్నంగా రష్యా నుంచి భారీ ఎత్తున ఇంధన దిగుమతులను కొనసాగించడం ఆ దేశాలు చెప్పేదొకటి.. చేసేదొకటిగా తేలిపోయింది. అయితే రష్యాతో గతంలో చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాలు, తక్షణ ఇంధన అవసరాల కోసమే రష్యా నుంచి యూరోపియన్ దేశాలు ఇంధన దిగుమతులను కొనసాగిస్తున్నాయని తెలుస్తోంది. అయిదేళ్ళ కాలపరిమితితో రష్యాతో దిగుమతులను సున్నాకు తీసుకువస్తామని కొన్ని యూరోపియన్ దేశాలు చెబుతున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu