RAJASTHAN CONGRESS: రెంటికి చెడ్డ రేవడిలా అశోక్ గెహ్లాట్ పరిస్థితి.. సచిన్‌ పైలట్ ఇపుడే నో ఛాన్స్.. మరి రాజస్థాన్ సీఎం సీటు దక్కేదెవరికి?

సెల్ఫ్ గోల్... లేదా హిట్ వికెట్... ఈ రెండు పదబంధాలు క్రీడా వార్తల్లోనే తరచూ చూస్తుంటాం. పొలిటికల్ ఫీల్డ్‌లో మాత్రం అప్పుడప్పుడు వినిపిస్తూ వుంటాయి ఈ పదబంధాలు. తాజాగా ఈ పదబంధాలు అశోక్ గెహ్లాట్ సరిగ్గా వర్తించేలా వున్నాయి.

RAJASTHAN CONGRESS: రెంటికి చెడ్డ రేవడిలా అశోక్ గెహ్లాట్ పరిస్థితి.. సచిన్‌ పైలట్ ఇపుడే నో ఛాన్స్.. మరి రాజస్థాన్ సీఎం సీటు దక్కేదెవరికి?
Sonia Gandhi , Rahul Gandhi , Sachin Pilot , Ashok Gehlot
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 30, 2022 | 2:27 PM

సెల్ఫ్ గోల్ … లేదా హిట్ వికెట్… ఈ రెండు పదబంధాలు క్రీడా వార్తల్లోనే తరచూ చూస్తుంటాం. పొలిటికల్ ఫీల్డ్‌లో మాత్రం అప్పుడప్పుడు వినిపిస్తూ వుంటాయి ఈ పదబంధాలు. తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ విషయంలో ఈ రెండు పదాలు అన్వయించుకునేందుకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. పచ్చిగా చెప్పాలంటే ‘ఉన్నది పోయింది.. ఉంచుకున్నది పోయింది’ అన్న చందంగా మారుతోంది అశోక్ గెహ్లాట్ పరిస్థితి. సోనియా  ఆశీస్సులు, విశ్వాసం పరిపుష్టిగా వుండడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడయ్యే అవకాశం వచ్చింది. అయితే, కునారిల్లిపోతున్న పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వుండి లాభమేంటనుకున్నారో లేక ముఖ్యమంత్రి హోదాలోనే తనకు ప్రయోజనం వుందనుకున్నారో ఏమోగానీ.. జాతీయ అధ్యక్షుడైనా సీఎం సీటు వదులుకోకూడదని అనుకున్నారు గెహ్లాట్. సోనియా స్వయంగా చెప్పడంతో జాతీయ అధ్యక్షునిగా పోటీ చేసేందుకు సిద్దమైనా.. సీఎం సీటులోను కొనసాగాలని భావించారు. నామినేటెడ్ పోస్టు కాదు కాబట్టి తాను రెండు పదవుల్లో కొనసాగవచ్చని తొలుత వాదించారు. కానీ పాదయాత్రలో వున్న రాహుల్ కేరళలో మీడియాతో మాట్లాడుతూ అశోక్ ఆశలపై నీళ్ళు జల్లారు. జోడు పదవుల్లో ఒక్కరే కొనసాగవద్దన్న ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్ తీర్మానాన్ని రాహుల్ ఉటంకించారు. అయినా సరే స్వయంగా కలిసి రాహుల్‌ని కన్విన్స్ చేసుకుందామని కొచ్చి చేరిన అశోక్ గెహ్లాట్.. ఓరకంగా రాహుల్ చేతిలో భంగపడ్డారు. రెండు పదవుల్లో కొనసాగడం కుదరదంటూ రాహుల్ కుండబద్దలు కొట్టారు. పనిలో పనిగా గెహ్లాట్ మీద ఓ బాంబు కూడా వేశారు. నాలుగేళ్ళుగా సీఎం సీటు కోసం కాచుకున్న సచిన్ పైలట్‌కే సీఎం సీటు అప్పగించాలని తేల్చేశారు. దాంతో ఖిన్నుడైన అశోక్ గెహ్లాట్.. పైకి మాత్రం డాబునే ప్రదర్శించారు. తానొచ్చింది రాహుల్‌ని కన్విన్స్ చేసి, జాతీయ అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని కోరేందుకేనని కొచ్చిలో మీడియా ముందు బొంకేశారు కూడా. అయితే మీడియా వదులుతుందా.. రాజస్థాన్ సీఎం పదవిని ఎవరికిస్తున్నారంటూ పదే పదే ప్రశ్నించింది. దాంతో జైపూర్‌లో జరగనున్న కాంగ్రెస్ శాసనసభా పక్షం భేటీలో ఏం జరుగుతుందో చూద్దామంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత జరిగిన కథ అందరికీ తెలిసిందే. గెహ్లాట్ అనుచరవర్గంగా పేరున్న ఓ ముగ్గురు నేతల సారథ్యంలో దాదాపు 82 మంది ఎమ్మెల్యేలు ర్యాలీ అయ్యారు. సెప్టెంబర్ 25న రాత్రి రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌ని కలిశారు. సచిన్ పైలట్‌ని సీఎం చేస్తే తామంతా మూకుమ్మడి రాజీనామాలకు పాల్పడతామని తెలిపారు. అయితే, కొన్ని మీడియా సంస్థలు వారంతా రాజీనామా పత్రాలను స్పీకర్‌కు అందజేశారని కూడా రాశాయి. రాజస్థాన్ పరిణామాలపై సహజంగా సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరమీద కనిపించకపోయినా జైపూర్ పరిణామాల వెనుక గెహ్లాట్ ఉన్నారన్నది ఏ మాత్రం రాజకీయ పరిఙ్ఞానం వున్నవారికైనా తెలిసిపోతుంది. పైగా తిరుగుబాటుకు సిద్దమైన వారికి సారథ్యం వహించిన ముగ్గురు గెహ్లాట్ ముఖ్య అనుయాయులు కావడంతో సోనియా సహా పార్టీ అధిష్టానవర్గం వారంతా గెహ్లాట్ తెరచాటు పాత్ర వుందని విశ్వసించారు. సోనియా తక్షణం అజయ్ మాకెన్, మల్లికార్జున ఖర్గేలను జైపూర్ పంపి.. సీఎల్పీ భేటీ నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. కానీ, ఆ సమావేశానికి మెజారిటీ ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం కనిపించకపోవడంతో భేటీని రద్దు చేసి న్యూఢిల్లీకి రిటర్న్ అయ్యారు అధిష్టానం దూతలిద్దరు. తమ పర్యటన వివరాలను అధినేత్రికి వివరించగా ఆమె లిఖిత పూర్వక నివేదికకు ఆదేశించారు. చివరికి లిఖిత పూర్వక నివేదిక ఆధారంగా జైపూర్ తిరుగుబాటుకు బాధ్యులుగా నిర్ధారించి శాంతి ధరీవాల్, ధర్మేంద్ర రాథోడ్, మహేశ్ జోషీలకు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. తీవ్రస్థాయి క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినందుకు చర్యలెందుకు తీసుకోకూడదో లిఖిత పూర్వకంగా పది రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఏఐసీసీ క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేసింది. మరోవైపు జాతీయ అధ్యక్షునిగా కాబోయే వ్యక్తి ఇలా తెరచాటు కార్యకలాపాలకు ఊతమివ్వడాన్ని సోనియా సీరియస్‌గా పరిగణించారు. గెహ్లాట్‌ను అధ్యక్ష రేసు నుంచి తప్పించాలని నిర్ణయించారు.

అధ్యక్ష రేసు నుంచి తప్పించడమంటే గెహ్లాట్ ఓరకంగా మేలు చేయడమేనని తొలుత భావించారు. కానీ సోనియా ఆగ్రహం అంతటితో చల్లారలేదు. దాంతో రాజస్థాన్ సీఎం బాధ్యతల నుంచి కూడా గెహ్లాట్‌ను తప్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. వెంటనే గెహ్లాట్‌ని న్యూఢిల్లీకి రమ్మని పిలిచారు. దాంతో ఆయన సెప్టెంబర్ 29వ తేదీన హస్తినలో సోనియాను కలిసి రాజస్థాన్ కాంగ్రెస్ పరిణామాలను వివరించారు. తిరుగుబాటుకు నైతిక బాధ్యత వహిస్తానంటూ అధినేత్రిని క్షమాపణలు కోరారు. 10, జన్‌పథ్ నుంచి బయటికి వచ్చిన అశోక్ గెహ్లాట్ జాతీయ అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజస్థాన్ సీఎంగా కొనసాగేది లేనిది సోనియా నిర్ణయిస్తారని ప్రకటించారు. సేమ్ డే సీఎం ఆస్పిరెంట్ సచిన్ పైలట్‌ కూడా సోనియాను కలిశారు. 2023లో జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు కలిసి కట్టుగా పనిచేస్తామని, పార్టీని వీడనని ఆమెకు చెప్పారు. నిజానికి 2020లోనే సచిన్ పార్టీని చీల్చేందుకు విఫలయత్నం చేశారు. కానీ ఎమ్మెల్యేలలో పట్టుమని పది మంది కూడా తన వెంట నడిచేందుకు సిద్దపడకపోవడంతో సచిన్ వెనక్కి తగ్గారు. అయితే ఆయనకు రాహుల్ అండదండలుండడంతో ఇపుడు రాజస్థాన్ సీఎం అవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు ఆ రాష్ట్రంలో వున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఆయన వర్గానికి పెద్దగా సంఖ్యాబలం లేదు. సో.. ఇపుడున్న పరిస్థితుల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించే సచిన్‌కు రాజస్థాన్ సీఎం సీటును ఇవ్వకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక అశోక్ గెహ్లాట్ పరిస్థితి మాత్రం దారుణమేనని చెప్పాలి. జాతీయ అధ్యక్షుడు కాలేకపోతున్నారు. అదేసమయంలో తిరుగుబాటు కారణంగా సీఎం సీటు నుంచి కూడా తప్పించే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ మరో విషయం ప్రస్తావించాలి. గత సంవత్సరం పంజాబ్ విషయంలో చేసిన ఓ ప్రయోగం వికటించి ఆ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను తప్పించి, చన్నీని సీఎం చేసింది. దళితుల ఓట్లతో గట్టెక్కుతామని భావించింది. తీరా ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైంది. ఇపుడు రాజస్థాన్‌లో 2023లో ఎన్నికలు జరగనున్నాయి. ఈతరుణంలో తిరుగుబాటుకు కారకుడయ్యారన్న పేరిట గెహ్లాట్‌ని తప్పిస్తారా అన్నది ఆసక్తి రేపుతోంది. గెహ్లాట్ తర్వాత బలమైన నేత సచిన్ పైలట్ కానీ.. మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో గెహ్లాట్ వర్గానికి చెందిన వారినే ముఖ్యమంత్రిని చేయాల్సి వుంటుంది. కాకపోతే ఆయన వర్గం యావత్తు తిరుగుబాటులో భాగస్వాములే. మరి గెహ్లాట్ తప్పిస్తారా ? తప్పిస్తే ఎవరికి అవకాశం ఇస్తారు? వచ్చే ఎన్నికల్లో గెహ్లాట్, పైలట్‌లకు మించి పనిచేసే సత్తా ఎవరికుంది ? ఇత్యాది ప్రశ్నాలిపుడు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గెహ్లాట్, సచిన్‌లిద్దరికీ ఆమోదయోగ్యునిగా వుండే వ్యక్తికి సీఎం సీటు అప్పగించి, సచిన్ పైలట్‌ని మరోసారి పీసీసీ అధ్యక్షున్ని చేస్తారన్న అంఛనాలు వినిపిస్తున్నాయి. 2018లో పీసీసీ అధ్యక్షుని హోదాలో రాజస్థాన్‌లో పార్టీని గెలిపించారాయన. మరోసారి పీసీసీ అధ్యక్షునిగా ఆయనకు ఛాన్సిచ్చి, ఎన్నికల వేళ ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని సోనియా భావిస్తుండవచ్చు. రాహుల్ ఆశీస్సులు కూడా పుష్కలంగా వున్న సచిన్ పైలట్.. వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపిస్తే.. ఆయన్ను సీఎం కాకుండా ఎవరు ఆపలేరు. కానీ అందుకు అనుకూలమైన పరిస్థితులు రాజస్థాన్‌లో వున్నాయా అన్నది కాలమే నిర్ణయించనున్నది.

మరిన్ని జాతీయం వార్తల కోసం

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!