Assembly El‌ections: ఓ రాష్ట్రంలో ఢంకా బజాయించనున్న బీజేపీ.. మరోచోట మాత్రం హోరాహోరీ.. హస్తినలో ఆప్ హవా.. ఇదే ఫలితం 8న ??

రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు ఊహించిన ఫలితాలనే ఇచ్చే సంకేతాలు ఎగ్జిట్ పోల్ సర్వేల తర్వాత మరింత బలపడ్డాయి. అందరు ఊహించినట్లుగానే గుజరాత్‌లో బీజేపీ రాబోతోంది. నెంబర్ గేమ్ కొంత టఫ్‌గా కనిపిస్తున్నా.. హిమాచల్ ప్రదేశ్‌లోను బీజేపీకే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Assembly El‌ections: ఓ రాష్ట్రంలో ఢంకా బజాయించనున్న బీజేపీ.. మరోచోట మాత్రం హోరాహోరీ.. హస్తినలో ఆప్ హవా.. ఇదే ఫలితం 8న ??
Gujarath Himachal Exit Pol
Follow us

|

Updated on: Dec 05, 2022 | 7:35 PM

రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీదే హవా అని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. కాకపోతే గుజరాత్‌లో థంపింగ్ విక్టరీ కొట్టనున్న బీజేపీకి.. హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టిపోటే ఎదురైంది. అయితేనేం బీజేపీనే స్వల్ప తేడాతో అధికారంలోకి వచ్చే సంకేతాలున్నాయని మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. వరుసగా ఏడోసారి గుజరాత్ సీఎం సీటును బీజేపీ కైవసం చేసుకోబోతున్నట్లు సర్వేలు చాటాయి. మొత్తం 182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 125 నుంచి 142 సీట్ల వరకు గెలుచుకునే అవకాశాలున్నాయని పలు సర్వేలు తేల్చాయి. అదేసమయంలో 68 సీట్లున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీ తలపడ్డట్లు తెలుస్తోంది. పోటీ నువ్వా నేనా అన్నట్లుండడంతో ఎవరు విజేతగా నిలిచినా నెంబర్ గేమ్‌లో స్వల్ప తేడానే వుండబోతున్నట్లు సర్వే సంస్థలు పేర్కొన్నాయి. బీజేపీకి 30 నుంచి 36 సీట్లు దక్కే అవకాశముందని, కాంగ్రెస్ పార్టీకి 28 నుంచి 34 సీట్లు దక్కే ఛాన్స్ వుందని కొన్ని సంస్థలు తేల్చాయి. మొత్తానికి యావత్ దేశం ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనున్న అసలు ఫలితాలపై మరింత ఆసక్తి పెంచాయి.

టీవీ9 నెట్‌వర్క్ సర్వే

ఇక టీవీ9 నెట్ వర్క్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలు గుజరాత్ పీఠం బీజేపీదేనని చాటాయి. బీజేపీకి 125 నుంచి 130 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 3 నుంచి 5 సీట్లు, ఇతరులకు 3 నుంచి 6 సీట్లు దక్కే ఛాన్స్ వుందని టీవీ9 నెట్ వర్క్ ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చాయి. హమాచల్ ప్రదేశ్‌లో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటాపోటీగా వుంది. బీజేపీకి 32 నుంచి 34, కాంగ్రెస్ పార్టీకి 30 నుంచి 32 సీట్లు, ఇతరులకు 3 నుంచి 5 సీట్లు దక్కే అవకాశం వుందని టీవీ9 నెట్ వర్క్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కాగా ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీదే హవా అని తేల్చింది టీవీ9 నెట్ వర్క్. రెండు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్ గణాంకాలు బీజేపీకి అనుకూలంగా వుండగా ఢిల్లీ జనం మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్ గణాంకాలు ఎలా వున్నా.. చర్చనీయాంశాలుగా మారిన అంశాలు మాత్రం బీజేపీకి ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలే రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానాంశాలుగా కనిపిస్తున్నాయి. అయితే, వీటి ఆధారంగా ఎన్నికలు జరిగినపుడు అధికార పార్టీ పట్ల వ్యతిరేకత వ్యక్తం కావాలి. నిరుద్యోగం పెరిగిపోతోందని, అందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వమే కారణమని చాలా మంది భావిస్తున్నారు. అదేసమయంలో ధరల పెరుగుదలకు కూడా మోదీ సర్కారే కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ రెండు కీలకాంశాలను మించిన మోదీ చరిష్మా ఎక్కువగా ప్రభావం చూపించి వుండవచ్చని అందుకే ఎగ్జిట్ పోల్ సర్వేలు బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రిపబ్లిక్ టీవీ, పీపుల్స్ పల్స్ వంటి సంస్థలైతే గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ విక్టరీ 2017 కంటే బంపర్‌ లెవెల్లో వుంటుందని తేల్చాయి. పీపుల్స్ పల్స్ బీజేపీకి 125 నుంచి 143 సీట్ల దాకా వస్తాయని అంచనా వేస్తుంది. రిపబ్లిక్ టీవీ అయితే ఏకంగా 148 సీట్ల మార్కును బీజేపీ తాకే అవకాశాలున్నట్లు తేల్చింది. 1985లో ఇందిరాగాంధీ మరణానాంతరం జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా అంటే 182 సీట్లకుగాను 145 సీట్లలో గెలుపొందింది. తాజాగా మోదీ మార్కు రాజకీయంతో కాంగ్రెస్ పార్టీ రికార్డును బీజేపీ బద్దలు కొట్టే అవకాశాలున్నాయని తేల్చింది రిపబ్లిక్ టీవీ.

బీజేపీ ఓట్ల శాతం తగ్గుముఖం!

పీపుల్స్ పల్స్ నివేదిక ప్రకారం 2017, 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ షేర్ తగ్గబోతోంది. 2017 నాటి ఎన్నికల్లో బీజేపీకి 49.1 శాతం ఓట్లు పోలవగా.. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి 46 శాతం ఓట్లు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. అంటే బీజేపీకి 3 శాతం ఓట్లు తగ్గుతున్నాయి. అయితే, గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీ బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ నష్టం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 2017 ఎన్నికల్లో 41.4 శాతం ఓట్లు రాగా ఈసారి ఆ పార్టీ ఓట్ల శాతం 25కు పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోల్పోతున్న 16 శాతం ఓట్లు గంపగుత్తగా కేజ్రీవాల్ పార్టీకి మళ్ళినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ కోల్పోయిన 3 శాతం ఓట్లు ఇతరులకు మళ్ళినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే 2017 ఇతరులకు పడిన ఓట్ల శాతం 9.5 కాగా.. ఈసారి ఇతరుల ఓట్ల శాతం 13కు పెరగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక గుజరాత్ ఎన్నికల ప్రధాన ప్రచారాంశాలను పరిశీలిస్తే అవి బీజేపీకి దెబ్బకొట్టాలి కానీ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అధిక ధరల అంశం 38 శాతం ప్రధాన ప్రచారంశంగా వుండింది. నిరుద్యోగం 22 శాతం, కనీస మద్దతు ధర 15 శాతం, అభివృద్ధి అంశం 9 శాతం, అవినీతి 6 శాతం ప్రచారాంశాలుగా కనిపించాయి. అయితే వీటన్నంటినీ మించి నరేంద్ర మోదీ చరిష్మానే గుజరాత్ పని చేసినట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి పదవి విషయంలో మాత్రం సిట్టింగ్ సీఎం విజయ్ రూపానీ రెండో స్థానానికి పడిపోయారు. పటేల్ వర్గానికి చెందిన భూపేందర్ పటేల్‌ ముఖ్యమంత్రి కావాలని 24 శాతం మంది కోరుకుంటుండగా, సిట్టింగ్ సీఎం మరోసారి ముఖ్యమంత్రి కావాలని కేవలం 20 శాతం మంది కోరుకుంటున్నారు. హార్దిక్ పటేల్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వారు 14 శాతం వుండడం విశేషం. 2017లో కాంగ్రెస్ పార్టీకి 77 సీట్లు రావడంతో హార్దిక్ పటేల్‌తో పాటు పటేల్ వర్గానికి చెందిన నేతలే ప్రధాన కారణం. ప్రస్తుతం హార్దిక్ పటేల్ బీజేపీలో వున్నారు. గత అయిదేళ్ళ కాలంలో కొన్ని సామాజిక వర్గాలు బీజేపీకి దూరమైనా పటేల్స్ దగ్గరవడంతో బీజేపీకి లాభించే అంశంగా మారింది. సో.. ఏది ఏమైనా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ మేరకు నిజమవుతాయో డిసెంబర్ 8వ తేదీనగానీ తేలదు.

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..