Breaking News
  • దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభన గడచిన 24 గంటల్లో అత్యధికంగా 24, 879 పాజిటివ్ కేసులు నమోదు కాగా 487 మంది మృతి. దేశంలో కరోన బాధితుల సంఖ్య 7, 67, 296 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 2, 69, 789 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 4, 76, 378 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 21, 129 మంది మృతి.
  • మూడో రోజు కొనసాగుతున్న సచివాలయం కూల్చివేత పనులు. భారీ బందోబస్తు మధ్య పనులు.. దారులన్నీ మూసివేత. నాలుగు బ్లాకులతో పాటు పాత భవనాలు నేలమట్టం. సమాంతరంగా ఇతర బ్లాకుల్లో కూల్చివేత పనులు. మరో మూడు రోజుల్లో కూల్చివేత పనులు పూర్తి. 15రోజుల పాటు అర్ధరాత్రి వేళ శిధిలాల తరలింపు. వారం పాటు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.
  • యూపీ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అరెస్ట్. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో అరెస్ట్. కొద్ది రోజుల క్రితం డీఎస్పీ సహా 8 మంది పోలీసులను కాల్చి చంపిన వికాస్ దూబే గ్యాంగ్. వికాస్ దూబే కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి గాలింపు. వరుసగా అనుచరుల ఎన్‌కౌంటర్, తాజాగా వికాస్ అరెస్ట్.
  • సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు. సిఐ శంకర్ లక్ష 25 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకొని సోదాలు చేస్తున్నారు.
  • హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. వాహనదారులు హెల్మెట్ ధరించి బైక్ నడపండి. నిన్న గోపాల్‌పురంలో ఒక వ్యక్తి బైక్ పై వెళ్తూ జారిపడి తలకు గాయమైంది.. తరువాత ఆసుపత్రిలో మరణించాడు. బహుశా అతను హెల్మెట్ ధరించి ఉంటే బ్రతికి ఉండేవాడు.. హెల్మెట్ మీ భద్రత కోసం.. పోలీసుల తనిఖీ కోసం కాదు. బైక్ పై వెళ్లేవారు తప్పకుండా హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేయండి.
  • విశాఖ: కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్ లో కరోనా కలకలం. టెస్ట్ లు నిర్బహించే ముగ్గురు టెక్నీషియన్లకు కరోనా పాజిటివ్. ల్యాబ్ లో సేవలందించే 20 మందికి పరీక్షలు.. అందరికీ నెగెటి. వైరాలజీ ల్యాబ్ లో సేవలు తాత్కాలికంగా నిలిపివేత.. ల్యాబ్ లో శానిటైజ్ చేస్తున్న జీవీఎంసీ సిబ్బంది. ప్రత్యామ్నాయంగా కేజీహెచ్ లోని నాకో ల్యాబ్ ను వినియోగిస్తున్న వైద్య సిబ్బంది.

ఆ’పరేషన్‌’.. చిరుతపులి

పట్టపగలు..జనవాసాల మధ్య నడిరోడ్డుపై చిరుత సంచరించడం అందరినీ భయాందోళనలకు గురి చేసింది. కనిపించినట్టే కనిపించి మాయమైపోయిన చిరుతను పట్టుకునేందుకు అధికారులు ఆపరేషన్ చిరుత మొదలుపెట్టారు.
operation chirutha tiger hunting in forest, ఆ’పరేషన్‌’.. చిరుతపులి

పట్టపగలు..జనవాసాల మధ్య నడిరోడ్డుపై చిరుత సంచరించడం అందరినీ భయాందోళనలకు గురి చేసింది. కనిపించినట్టే కనిపించి మాయమైపోయిన చిరుతను పట్టుకునేందుకు అధికారులు ఆపరేషన్ చిరుత మొదలుపెట్టారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ శివారు ప్రాంతాల్లో తిరుగుతున్న చిరుత కోసం వేట ముమ్మరంగా సాగుతోంది. చిరుతను బంధించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత జాడ మరోసారి కనిపించడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో పులి తిరుగుతునట్లుగా అక్కడే అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయింది. యూనివర్సిటీ సమీపంలో తిరుగుతున్నట్లుగా గమనించిన సిబ్బంది అటవీ అధికారులను అప్రమత్తం చేశారు. చిరుత పులిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీలో చిరుత వెళ్లిన డైరెక్షన్‌.. అడుగుల ఆధారంగా దాన్ని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మే 14న కాటేదాన్ ప్రాంతంలో చిరుత పులి నడిరోడ్డుపై పడుకొని కలకలం సృష్టించింది. అటుగా వెళ్లేవారిని భయభ్రాంతులకు గురి చేసింది. అంతేకాదు ఓ లారీ డ్రైవర్‌పై దాడి చేసి సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. అదే సమయంలో చిరుతను పట్టుకునేందుకు అధికారులు చేసిన ప్రతయ్నం ఫలించలేదు. ఇప్పటి వరకూ చిరుత ఆచూకీ దొరకలేదు.
ఇప్పుడు మళ్లీ సీసీటీవీ కెమెరాల్లో చిరుత ఆచూకీ లభ్యమైంది. మే నెలాఖరున అగ్రికల్చర్‌ యూనివర్సిటీ సీసీటీవీ కెమెరాల్లో మళ్లీ చిరుత పులి జాడ కనిపించినట్లుగా అధికారులు చెబుతున్నారు. అగ్రికల్చర్‌ యూనివర్సిటీ నుంచి గగన్‌పహాడ్‌ గుట్టల్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టుగా అధికారులు గమనించారు. మళ్లీ ఆ విశ్వవిద్యాలయం చుట్టుపక్కలే చిరుత పులి సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. చిరుత పులిని పట్టుకునేందుకు ఇప్పటికే రాజేంద్రనగర్‌ ప్రాంతంలో 20 నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటి ఫుటేజీని అధికారులు పూర్తిగా విశ్లేషిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా చిరుత కోసం గాలింపు చర్యలు అధికారులు ముమ్మరం చేశారు. అధికారులు మొదలు పెట్టిన ఆపరేషన్ చిరుతపులి సక్సెస్ అవుతుందా లేదా చూడాలి.

Related Tags