33 లక్షల హైదరాబాద్ ప్రయాణికులకు 600 బస్సులు మాత్రమే!

తెలంగాణలో బస్సు చక్రం ఆగిపోయింది. సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేశారు. డిమాండ్ల విషయంలో ఐఏఎస్ కమిటీ‌తో జరిగిన చర్చలు ఎటూ తేలకపోవడంతో సమ్మెకు వెళ్లాలని కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. కానీ, ప్రభుత్వం దీనిపై చాలా తీవ్రంగా స్పందించింది. శనివారం సాయంత్రం 6 గంటలలోగా విధులకు రాని ఉద్యోగులు, ఇక ఉద్యోగం వదులుకున్నట్టే అని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రకటన చేశారు. అయినప్పటికీ 52 వేల మంది ఉద్యోగులు తిరిగి విధుల్లో […]

33 లక్షల హైదరాబాద్ ప్రయాణికులకు 600 బస్సులు మాత్రమే!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 06, 2019 | 12:36 PM

తెలంగాణలో బస్సు చక్రం ఆగిపోయింది. సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేశారు. డిమాండ్ల విషయంలో ఐఏఎస్ కమిటీ‌తో జరిగిన చర్చలు ఎటూ తేలకపోవడంతో సమ్మెకు వెళ్లాలని కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. కానీ, ప్రభుత్వం దీనిపై చాలా తీవ్రంగా స్పందించింది. శనివారం సాయంత్రం 6 గంటలలోగా విధులకు రాని ఉద్యోగులు, ఇక ఉద్యోగం వదులుకున్నట్టే అని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రకటన చేశారు. అయినప్పటికీ 52 వేల మంది ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరలేదు. ప్రభుత్వంతో యూనియన్ ప్రతినిధులు చర్చలకు సిద్ధమని ప్రకటించినా, గవర్నమెంట్ మాత్రం మరోసారి మాట్లాడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో ప్రయాణం చేసేవాళ్లు కావచ్చు..సిటీ నుంచి బయట ప్రాంతాలకు రాకపోకలు చేసే  ప్రయాణికులు దాదాపు 33 లక్షల వరకు ఉంటారని ఓ అంచనా. ఇక పండుగ సీజన్‌ కావడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

జీహెచ్‌ఎంసీ పరిమితుల్లో నడిచే దాదాపు 3,500 ఆర్టీసీ బస్సుల్లో, సమ్మె కారణంగా 400 నుంచి 600 వరకు సర్వీసులు కొనసాగుతున్నాయి. అది కూడా ప్రైవేట్ వ్యక్తులతో ప్రభుత్వం బస్సులు నడుపుతోంది. ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. జీహెచ్‌ఎంసీ పరిమితుల్లో 377 ప్రైవేట్ హైర్ బస్సులు (పీహెచ్‌బీ) మాత్రమే ఉన్నాయి, అవి సమ్మెలో చేరడానికి నిరాకరించాయి. వీరు కాక మరో 300 మంది వరకు భారీ వాహానాల లైసెన్స్ ఉన్న ప్రయివేట్ డ్రైవర్లను హైర్ చేసుకుంది. 

ప్రతి డిపోలో ఒక  మోటారు వాహన ఇన్స్‌పెక్టర్ ఆద్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.  ప్రయివేటు బస్సు డ్రైవర్లను ఎక్కడికి కేటాయించాలి, వారికిచ్చే జీతభత్యాలులతో పాటు డ్రైవింగ్ విషయంలో ఆ కమిటీ ప్రాథమిక శిక్షణ ఇస్తుంది. ఇక ఏపీనుంచి కొన్ని బస్సులు కేటాయించాల్సిందిగా తెలంగాణ అధికారులు కోరారు. మరోవైపు దసరా సెలవులు కావడంతో స్కూల్ బస్సులను కూడా ప్రజారవాణాకు ఉపయోగిస్తున్నారు. ఇక ఓలా, ఉబర్ లాంటి సంస్థలను కూడా తమ సర్వీసులు సుదూర ప్రాంతాలకు విస్తరించాల్సిందిగా ప్రభుత్వ అధికారులు. ఇక హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులు కూడా పెరగనున్నాయి.  తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 12.30 వరకు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి .

అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా.. అవి సరిపోవడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు శనివారం కేవలం 160 మంది ఉద్యోగులు మాత్రమే విధుల్లో చేరారు. అన్ని జిల్లాల్లోనూ స్వల్ప సంఖ్యలో బస్సులు రోడ్డెక్కుతున్నాయి. ప్రైవేటు, తాత్కాలిక, ఒప్పంద ఉద్యోగులను  డిపోల్లోకి రానిచ్చేది లేదంటూ కార్మికులు ఉద్ఘాటించారు. డిపోల ముందు బతుకమ్మలను పేర్చి దమ్ముంటే వాటిని తొక్కించుకుని వెళ్లాలని హెచ్చరించడంతో ఉదయం నుంచి బస్సులు బయటకు రాలేదు. ఆర్టీసీ యూనియన్లు వ్యూహాత్మకంగా ఆలోచించే నేడు సద్దుల బతుకమ్మ పండుగ కావడంతో, బతుకమ్మలను తెచ్చి, డిపోల నుంచి బయటకు రావాలని చూసే బస్సులను అడ్డుకుంటున్నారని తెలుస్తోంది.

ఆదివారం ఉదయం సమ్మె ఉద్ధృతం కాగా, కనీసం నిన్న నడిచినన్ని బస్సులు కూడా నేడు నడిచే పరిస్థితి కనిపించడం లేదు. రెండో రోజు వినూత్నంగా నిరసన తెలపాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించారు. డిపోల ఎదుట బతుకమ్మ కుటుంబాలతో కలిసి సాయంత్రం బతుకమ్మ ఆడనున్నారు. అక్టోబరు 7న గన్‌పార్క్ వద్ద అమరులకు నివాళులర్పించి, ఇందిరా పార్కు వద్ద 15 మంది ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు. అలాగే, సమ్మెకు అన్ని రాజకీయ, ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి సంఘాల మద్దతు కోరుతూ ఆదివారం లేఖలు రాయనున్నారు. మరోవైపు, ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం సమీక్షించే అవకాశం ఉంది.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!