Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

ఆన్‌లైన్ వ్యభిచారం.. ముగ్గురు యువతులు అరెస్ట్!

Online Sex Racket, ఆన్‌లైన్ వ్యభిచారం.. ముగ్గురు యువతులు అరెస్ట్!

హైదరాబాద్‌లో మరో సెక్స్ రాకెట్‌ను పోలీసులు గుట్టు రట్టు చేశారు. సైలెంట్‌గా.. వెబ్‌సైట్ ద్వారా ఈ దందాను నడిపించేస్తున్నారు. ఆన్‌లైన్‌లో నెటిజన్స్‌కి వల వేస్తూ.. వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గృహంపై ఎస్‌ఆర్ నగర్ పోలీసులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో ముగ్గురు యువతుల్ని, ముగ్గురు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  చిట్టి, చరణ్ అనే యువకులు.. డబ్బుకు ఆశపడి ‘లోకంటో’ అనే వెబ్‌సైట్ నిర్వహిస్తున్నారు. ఈ సైట్‌లో నెటిజన్‌లను ఆకర్షించేలా పలువురి యువతుల ఫొటోలను పెడుతూ ఉండేవారు. వీటిపై నిఘా పెట్టిన పోలీసులు అదునుచూసి, పక్కా సమాచారంతో నిందితులను అరెస్ట్ చేశారు. వీరందరూ బెంగాల్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో నిర్వాహకులు చిట్టిని అదుపులోకి తీసుకోగా.. చరణ్ పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.