యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్..

ఆన్‌లైన్‌లో పబ్జీ ఆడుతూ..చదువును నిర్లక్ష్యం చేస్తున్న కొడుకును తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఆ బాలుడు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. కాగా, అటువంటి సంఘటనే మరొకటి మంచిర్యాల జిల్లాలో జరిగింది.

యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 14, 2020 | 9:52 AM

ఆన్‌లైన్‌లో పబ్జీ ఆడుతూ..చదువును నిర్లక్ష్యం చేస్తున్న కొడుకును తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఆ బాలుడు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. కాగా, అటువంటి సంఘటనే మరొకటి తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో జరిగింది. ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనంగా మారిన ఓ యువకుడు లక్షల్లో అప్పులు చేశాడు. తల్లిదండ్రులు మందలించటంతో చివరకు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. లక్షెట్టిపేట,మోదెల గ్రామానికి చెందిన తోట శంకర్‌-లక్ష్మిల కొడుకు మధూకర్‌ హైదరాబాద్‌లో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. అయితే, కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికి వచ్చిన మధూకర్…ఐదు నెలలుగా సెల్‌ఫోన్‌లో దఫాబెట్‌ గేమ్‌ ఆడుతున్నాడు. ఈ క్రమంలో రూ.15 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. విషయం తండ్రికి తెలియడంతో అప్పు తెచ్చి కట్టేశాడు. ఇంకోసారి అలాంటి గేమ్‌లు ఆడవద్దని నచ్చజెప్పాడు. అంతపెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకోవడంతో మధూకర్‌ తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ నెల 7న పని మీద బయటకు వెళ్తున్నానని చెప్పి మంచిర్యాలకు వెళ్లి పురుగుల మందు కొనుక్కొని శివారు ప్రాంతంలో తాగాడు. అనంతరం బంధువులకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. వారు కుటుంబసభ్యులకు సమాచారమివ్వడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

ఎంతచెప్పినా వినకుండా..ఆన్‌లైన్ జూదం పేరుతో..అప్పులు చేస్తూ…చివరకు ప్రాణాలు పొగొట్టుకున్న కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ న్‌లైన్ గేమ్ కు బానిసకావడం వల్లే తమ కొడుకు చనిపోయాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకాసి లాగా మనుషుల ప్రాణాలు మింగుతున్న ఈ గేమ్ ను నిషేదించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..