Breaking News
  • అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ పై సీఎం జగన్ సమీక్ష . 2014 అంచనాల ప్రకారం 20398.61 మాత్రమే ఇరిగేషన్ కంపోనెంట్ కు చెల్లిస్తాం అని పేర్కొన్న కేంద్ర ఆర్థిక శాఖ. దీనిపై అంగీకారం తెలపాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పిపిఏ) ను కోరిన కేంద్ర ఆర్థిక శాఖ . 55448.87 కోట్ల రూపాయల వ్యయం కు ఆమోదం తెలిపిన పిపిఏ, సీడబ్లూసి. అందులో 47725.74 కోట్ల రూపాయలకు రివైస్డ్ కాస్ట్ కమిటీ, కేంద్ర జెల్ శక్తి ఆమోదం. అది ఆమోదించాలని ఆర్థిక శాఖను జల శక్తి శాఖ కోరిందని సీఎంకు వివరించిన అధికారులు .
  • కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ల బదిలీలు. సిద్దిపేట కలెక్టర్ గా దీర్ఘకాలికంగా అంటే మూడేళ్లకు పైగా కొనసాగుతున్న వెంకట్రామిరెడ్డిని తొలగించాలని కోరిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. తదనుగుణంగా మరికొందరు కలెక్టర్ల బదిలీలను సూచించిన తెలంగాణా సీఈఓ. ఆమేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
  • రాష్ట్రంలో కలెక్టర్ల బదిలీ: ముగ్గురికి స్థాన చలనం. ఇద్దరికి అదనపు బాధ్యతలు. మెదక్ కు హన్మంత రావు సంగారెడ్డికి వెంకట్రామిరెడ్డి సిద్దిపేటకు భారతీ హోలీకెరీ. పెద్దపల్లి అదనపు బాధ్యతలు కరీంనగర్ కలెక్టర్ శశాంకకు. మంచిర్యాల అదనపు బాధ్యతలు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్టా పట్నాయక్ కు.
  • విశాఖ: ఇకపై విశాఖ కేంద్రంగా కొనసాగనున్న AP మెట్రో రైల్ కార్పొరేషన్ కార్యకలాపాలు విశాఖలో నేడు ప్రారంభం కానున్న AP మెట్రో రైలు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నగరంలోని LIC బిల్డింగ్ లోని 3వ అ౦తస్తులో కార్యాలయం మద్యహ్న౦ 12 గ౦టలకు మెట్రో కార్యాలయాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ మ౦త్రి బొత్స
  • ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రి పై చివరి రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. నేడు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్రులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఉత్సవాలకు చివరి రోజు కావడంతో రాజరాజేశ్వరి దేవి దర్శనార్ధం తరలి వస్తున్న భక్తులు . సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవం . ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహంతో దుర్గమ్మ నదీ విహారం రద్దు . హంస వాహనంపైనే అమ్మవారి ఉత్సవ మూర్తులకు పూజాది కార్యక్రమాలను నిర్వహించనున్న అర్చకులు . పరిమిత‌సంఖ్యలోనే‌ విఐపి లకు అనుమతి. ఘాట్లలో భక్తులకు అనుమతి నిరాకరణ...ప్రకాశం బ్యారేజి నుంచి మాత్రమే వీక్షించేందుకు అనుమతి.
  • మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేలుడు కలకలం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ 31 బస్ స్టాప్ దగ్గర్లో ఉన్న ముత్యాలమ్మ టెంపుల్ ముందు ఉన్న చెత్త డబ్బాలో పేలిన కెమికల్ డబ్బా. చెత్త డబ్బాలో చెత్త ఏరుకునే రాజు అనే వృద్ధుడి చేతికి తీవ్ర గాయాలు. 108లో ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పోలీసులు.

చైనా యాప్‌పై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు

ఆన్‌లైన్‌ గేమ్స్ పేరుతో చైనా యాప్స్ భారీ నిధులు మళ్లించినట్లు భారత నిఘా వర్గాలు నిర్ధారించాయి. ఈ మేరకు చైనా యాప్‌పై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదయింది.

online games fraud case registered against Chinese app companies in hyderabad ccs, చైనా యాప్‌పై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు

ఆన్‌లైన్‌ గేమ్స్ పేరుతో చైనా యాప్స్ భారీ నిధులు మళ్లించినట్లు భారత నిఘా వర్గాలు నిర్ధారించాయి. ఈ మేరకు చైనా యాప్‌పై హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదయింది. ఉగ్రవాద కోణంలో ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆన్‌లైన్‌లో గేమ్స్‌ పేరుతో చైనా యాప్‌లకు నిధుల మళ్లింపుపై ఎన్‌ఐఏ అధికారులు సీసీఎస్‌ నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా నగదు చైనాకు తరలించిన కంపెనీలపై దర్యాప్తు చేపట్టాయి నిఘావర్గాలు. యాప్స్‌ పేరుతో భారతీయుల జేబులు గుళ్ల చేయడంతో పాటు, వ్యక్తిగత సమాచారం సేకరించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేన్తున్నారు. అనధికారికంగా వేల కోట్ల రూపాయలని చైనా కు తరలించినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ చైనా యాప్‌లపై ఈడీతో పాటు ఐటీ కూడా విచారణ చేస్తోంది.

Related Tags