చిత్తూరు జిల్లాలో బయటపడ్డ మరో ఆన్‏లైన్ మోసం.. యాప్ ద్వారా కొనుగోలు చేయెచ్చు అంటూ..

ఇటీవల కాలంలో ఆంద్రప్రదేశ్‏లో వరుసగా ఆన్‏లైన్ మోసాలు బయటపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా లోన్ మనీ యాప్‏లతో కొంతమంది

చిత్తూరు జిల్లాలో బయటపడ్డ మరో ఆన్‏లైన్ మోసం.. యాప్ ద్వారా కొనుగోలు చేయెచ్చు అంటూ..
Follow us

|

Updated on: Dec 28, 2020 | 12:58 PM

ఇటీవల కాలంలో ఆంద్రప్రదేశ్‏లో వరుసగా ఆన్‏లైన్ మోసాలు బయటపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా లోన్ మనీ యాప్‏లతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మరువకముందే చిత్తూరు జిల్లాలో మరో ఆన్‏లైన్ మోసం బయటపడింది. ఓఎంజీ యాప్ ద్వారా వస్తువులను కొనుగోలు చేసి లాభాలు పొందవచ్చని చెప్పి మోసం చేశారని భాదితులు వాపోతున్నారు. జిల్లాలోని కుప్పం, రామకుప్పం, వికోట, చిత్తూరు, బి.కొత్తకోట మండలాల్లో ఈ యాప్ ద్వారా మోసపోయిన భాదితులు క్రమంగా పెరుగుతున్నారు. ఓఎంజీ యాప్ ద్వారా వస్తువులు కొనుగోలు చేసి లాభాలు పొందవచ్చని చెబుతూ.. చైన్ లింక్ బిజినెస్‏తో తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో యాప్ నిర్వాకులపై కేసులు పెట్టెందుకు సమీప పోలీస్ స్టేషన్లకు బాధితులు క్యూ కడుతున్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఓఎంజీ యాప్ బిజినెస్ పై ఆరా తీస్తున్నారు. ఈ యాప్ ద్వారా మోసపోయిన వారిని కుప్పం పోలీసులు విచారిస్తున్నారు. ఓఎంజీ యాప్ బిజినెస్ ద్వారా మోసపోయిన వారిలో ఎక్కువగా వ్యాపారులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు ఉన్నారు.