రూ. 22 లక్షల విలువైన ఉల్లిపాయలు చోరీ!

దేశంలో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. వాటి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మంచి రకం ఉల్లి ధర మార్కెట్‌లో కిలో రూ.100 పలుకుతోంది. మహారాష్ట్రలో నాసిక్‌లోని ఒక వ్యాపారికి చెందిన ట్రక్ చోరీకి గురైంది. ఆ ట్రక్ 40 టన్నుల ఉల్లిపాయలతో నవంబర్ 11 న నాసిక్ నుండి బయలుదేరి 22 న గోరఖ్ పూర్ చేరుకోవలసి ఉంది. సమయానికి ట్రక్ గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ట్రక్ చోరీకి గురైందని వ్యాపారి […]

రూ. 22 లక్షల విలువైన ఉల్లిపాయలు చోరీ!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 30, 2019 | 5:56 PM

దేశంలో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. వాటి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మంచి రకం ఉల్లి ధర మార్కెట్‌లో కిలో రూ.100 పలుకుతోంది. మహారాష్ట్రలో నాసిక్‌లోని ఒక వ్యాపారికి చెందిన ట్రక్ చోరీకి గురైంది. ఆ ట్రక్ 40 టన్నుల ఉల్లిపాయలతో నవంబర్ 11 న నాసిక్ నుండి బయలుదేరి 22 న గోరఖ్ పూర్ చేరుకోవలసి ఉంది. సమయానికి ట్రక్ గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ట్రక్ చోరీకి గురైందని వ్యాపారి ప్రేమ్ చంద్ శుక్లా తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. టెండూ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ట్రక్ నిలిపి ఉంచినట్లు గుర్తించినప్పటికీ అది ఖాళీగా ఉందని పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ సింగ్ చందేల్ తెలిపారు.

ఈ నేపథ్యంలో.. ఇటీవలే పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని సుతహతా ప్రాంతంలో విచిత్రం జరిగింది. ఒక దుకాణంలో జరిగిన దొంగతనంలో డబ్బుకు బదులుగా ఉల్లిపాయలు దొంగిలించారు. అక్షయ్ దాస్, మంగళవారం ఉదయం తన దుకాణం తెరిచినప్పుడు వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిఉండడం గమనించాడు. అయితే నగదు పెట్టెలో ఉంచిన డబ్బు చెక్కుచెదరకుండా అలాగే ఉంది, కానీ ఉల్లిపాయలు ఉన్న బస్తాలు దొంగిలించబడ్డాయి. వాటి విలువ దాదాపు 50 వేల రూపాయలు. కొన్ని వెల్లుల్లి మరియు అల్లం బస్తాలను కూడా దోచుకున్నారని దాస్ వివరించారు.