కిలో ఉల్లి.. వందనోటుకే “పలుకుద్ది”

ఉల్లి ధర మరోసారి నింగిని తాకుతోంది. బంగారంతో పోటీ పడుతూ సెంచరీకి చేరవైంది. గత కొద్ది రోజులుగా ఉత్తర భారతంతో పాటుగా.. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఉల్లికి డిమాండ్ పెరిగింది. దీంతో ధరలకు అదుపులేకుండా పోయింది. నిత్యం వంటల్లో కీలకమైన ఈ ఉల్లి.. గతకొద్ది రోజులుగా కొనలేని పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో కిలో ధర రూ.100 వరకు ఉండగా.. యూపీలో రూ. 70 నుంచి 80 వరకు పలుకుతోంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో […]

కిలో ఉల్లి.. వందనోటుకే పలుకుద్ది
Follow us

| Edited By:

Updated on: Nov 05, 2019 | 3:21 PM

ఉల్లి ధర మరోసారి నింగిని తాకుతోంది. బంగారంతో పోటీ పడుతూ సెంచరీకి చేరవైంది. గత కొద్ది రోజులుగా ఉత్తర భారతంతో పాటుగా.. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ఉల్లికి డిమాండ్ పెరిగింది. దీంతో ధరలకు అదుపులేకుండా పోయింది. నిత్యం వంటల్లో కీలకమైన ఈ ఉల్లి.. గతకొద్ది రోజులుగా కొనలేని పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో కిలో ధర రూ.100 వరకు ఉండగా.. యూపీలో రూ. 70 నుంచి 80 వరకు పలుకుతోంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో రూ. 40 నుంచి 50 మధ్యలో కొనసాగుతోంది.

గతంలో కిలో ధర కేవలం రూ.20 లోపు మాత్రమే ఉండేది. అయితే గత ఆగస్ట్, సెప్టెంబర్‌ నెలల్లో.. ఒక్కసారిగా వీటి ధర పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ఉల్లి ధరను నియంత్రించేందుకు ప్రయత్నించింది. విదేశాలకు ఉల్లిని ఎగుమతి చేయడంపై నిషేధం కూడా విధించింది. ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో కిలో ఉల్లి ధర.. హైదరాబాద్‌లో రూ. 80 పలికిన విషయం విదితమే. దీంతో పలుచోట్ల ప్రభుత్వ ఆధ్వర్యంలో స్పెషల్ కౌంటర్లను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. అయితే మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల ఎఫెక్ట్‌తో.. ఉల్లి సాగుకు బ్రేకులు పడ్డాయి. దీంతో ఉల్లి సరఫరా తగ్గిపోయింది. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.