Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఉల్లి ధర.. కర్నూల్ మార్కెట్‌లో ఎంతంటే..?

Onion prices down in kurnool market, గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఉల్లి ధర.. కర్నూల్ మార్కెట్‌లో ఎంతంటే..?

గతకొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న ఉల్లి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్న మొన్నటి వరకు కిలో ఉల్లి ధర.. రూ.150 వరకు ఉండగా.. తాజాగా.. వందకు చేరుకుంటుంది. గురువారం, శుక్రవారం వరకు కర్నూల్ మార్కెట్‌లో క్వింటా ఉల్లిధర.. రూ.12500 నుంచి రూ.15వేల వరకు పలికింది. అయితే ఏపీ ప్రభుత్వం ధరలకు కల్లెం వేసేందుకు తీసుకున్న చర్యలతో ఉల్లి ధర తగ్గుముఖం పడుతోంది. శనివారం కర్నూల్ మార్కెట్‌లో క్వింటా ఉల్లి ధర.. తొమ్మిదివేల లోపుకు వచ్చేసింది. దీంతో ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే.. ఏపీలో ఉల్లి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు కిలో ఉల్లి రూ.150 ఉండగా.. ప్రస్తుతం వందలోపే లభిస్తుంది. మరోవైపు ఏపీలోని రైతు బజార్లలో.. సబ్సిడీ కౌంటర్లలో కిలో ఉల్లి.. ఇరవై అయిదు రూపాయలకే లభిస్తుంది. ఒక్కొక్కరికి కేవలం ఒక కిలో మాత్రమే అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. పొరుగు రాష్ట్రాల్లో మాత్రం ఉల్లి ధరులు భారీగా పెరిగిపోతున్నాయి. సెంచరీ నుంచి ఏకంగా డబుల్ సెంచరీ దిశగా పరుగులు పెడుతోంది. హైదరాబాద్, చెన్నైలో రూ.150కి పైగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా ఉంది. అక్కడ ప్రస్తుతం కిలో ఉల్లి కావాలంటే.. రెండు వంద నోట్లు తీయాల్సిందే. అయితే ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల ఎఫెక్ట్‌తో.. ఉల్లి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఉల్లి డిమాండ్ విపరీతంగా పెరిగింది.