పవన్ సినిమాపై కొనసాగుతున్న సస్పెన్స్.. త్రివిక్రమ్ ఎంట్రీ ఉంటుందా లేదా? స్పష్టత లేని మళయాల రిమేక్..

మళయాల సూపర్ హిట్ మూవీ అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ తెలుగు రీమేక్‌ చేయడానికి సితార ఎంటర్ టైన్‌మెంట్ సంస్థ ప్రయత్నిస్తోంది. ఇందులో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా స్టోరీలో కొన్ని మార్పులు చేసి కొన్ని డైలాగులు దర్శకుడు త్రివిక్రమ్‌తో రాయించాలని మేకర్స్ భావిస్తున్నారట.

  • uppula Raju
  • Publish Date - 4:17 pm, Wed, 25 November 20
పవన్ సినిమాపై కొనసాగుతున్న సస్పెన్స్.. త్రివిక్రమ్ ఎంట్రీ ఉంటుందా లేదా? స్పష్టత లేని మళయాల రిమేక్..

మళయాల సూపర్ హిట్ మూవీ అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ తెలుగు రీమేక్‌ చేయడానికి సితార ఎంటర్ టైన్‌మెంట్ సంస్థ ప్రయత్నిస్తోంది. ఇందులో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా స్టోరీలో కొన్ని మార్పులు చేసి కొన్ని డైలాగులు దర్శకుడు త్రివిక్రమ్‌తో రాయించాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఒరిజినల్ కంటెంట్‌తో సినిమా చూసిన కొంతమంది సినీ అభిమానులు మార్పులు, చేర్పులు అవసరం లేదని కథా, కథనం బాగానే ఉందని సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా ఇందులో ఏమైనా మార్పులు చేస్తే సినిమా అనుకున్నంతగా ఆడకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎవరెవరు కలిసి పనిచేస్తున్నారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.