Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,252 కేసులు, 467 మంది మృతి. దేశవ్యాప్తంగా7,19,665 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,59,557 యాక్టీవ్ కేసులు4,39,948 మంది డిశ్చార్జ్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విశాఖలో కిడ్నాప్ కలకలం. ఫైనాన్షియర్ జామి సంతోష్ కుమార్ ను ఎత్తుకెళ్ళిన దుండగులు. తన భర్తను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు సమాచారమందించిన సంతోష్ భార్య . కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని వచ్చానని పోలీసుల చెంతకు చేరిన సంతోష్. డబ్బులకోసం తనను చంపేస్తానని కిడ్నాప్ చేసినట్టు పోళిసులకు సంతోష్ వాంగ్మూలం. ఫోర్త్ టౌన్ పీఎస్ లో కేసు నమోదు . సంతోష్ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి ప్రత్యేక బృందాలు. యలమంచిలి వైపు నిందితులు వెళ్ళినట్టు పోళిసుల అనుమానం.. గాలిస్తున్న పోలీసులు.
  • పాత సచివాలయం కూల్చివేత కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూల్చివేత ను ప్రారంభించిన ప్రభుత్వం. నిన్న అర్ధరాత్రి నుంచి పాత సచివాలయం లోని భవనాలను కూల్చివేస్తున్న అధికారులు. సచివాలయం చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు. పాత సచివాలయానికి వెళ్లే రోడ్లున్నీ మూసివేసిన పోలీసులు. పాత సచివాలయం కిలోమీటర్ వరకు మోహరించిన పోలీసులు. ఇప్పటికే సచివాలయంలోని మధ్య లో ఉన్న కొన్ని భవనాలను నేలమట్టం చేసిన అధికారులు.
  • రెపటినుండి నిమ్స్ లో ప్రారంభం కానున్న క్లినికల్ ట్రైల్స్. ఏర్పాట్లను పూర్తి చేసిన నిమ్స్ యాజమాన్యం. ఎథిక్స్ కమిటీ అద్వర్యం లో జరగనున్న క్లినికల్ ట్రైల్స్.
  • విశాఖ: సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రమాద ఘటనపై నివేదిక సమర్పించిన విచారణ కమిటీ. సాయినార్ ప్లాంట్ లో తప్పిదాలను, లోపాలను ఎత్తి చూపిన కమిటీ.  రెస్క్యూ ఆపరేషన్ నిర్వహణలో కార్మికులకు మాస్కులు కూడా అందుబాటులో ఉంచని యాజమాన్యం. కంపెనీలో తయారుచేస్తున్న ప్రమాదకర రసాయినాలకు సంబంధించి HARA, HAZOP రిపోర్ట్ లను స౦బ౦దిత శాఖధికారులకు అ౦దజేయలేదు. కెమికల్స్ తో సంభవించే ప్రమాదాలపై కార్మికులకు అవగాహన కల్పించలేదని తేల్చిన కమిటీ. స్టోరీజీ నిల్వలపై నిర్దేశించిన ప్రమాణాలు పాటించలేదని నిర్ధారించిన కమిటీ.
  • పెద్ద అంబర్పేట్ అవుటర్ రింగ్ రోడ్డు పై ప్రమాదం. అవుటర్ రింగ్ రోడ్డు పై ఏపీ మంత్రి ఎస్కార్ట్ వాహనం బోల్తా. హెడ్ కానిస్టేబుల్ పాపయ్య మృతి మరో ముగ్గురు కానిస్టేబుల్లకి గాయాలు. ఏ పి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎస్కార్ట్ వాహనం టైర్ బ్లాస్ట్ అవ్వడం తో పల్టీ కొట్టిన బొలెరో వాహనం. ప్రమాదం లో గాయపడ్డ వారిని హయత్ నగర్ లోని హాస్పిటల్ కి తరలింపు. గచ్చిబౌలి నుండి విజయవాడకి వెళ్తుండగా ఘటన.

అదిరిపోయే ఫీచర్లతో… మార్కెట్లోకి వన్ ప్లస్ 7టీ ప్రో!

OnePlus 7T Pro launched: Price in India sale date and everything else to know, అదిరిపోయే ఫీచర్లతో… మార్కెట్లోకి వన్ ప్లస్ 7టీ ప్రో!

ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్ ప్లస్ దూకుడు పెంచింది. తాజాగా వన్‌ ప్లస్‌ 7 సిరీస్‌లో వచ్చిన వన్ ప్లస్ 7టీకి కొనసాగింపుగా ‘వన్ ప్లస్ 7టీ ప్రొ’ పేరుతో మరో కొత్త ఫోన్‌ను తీసుకువచ్చింది. అంచనాలను నిజం చేస్తూ అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేసింది వన్ ప్లస్ 7టీ ప్రో. ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టంతో వచ్చిన మొదటి ఫోన్‌ ఇదే. వివరాల్లోకెళితే…

వన్ ప్లస్ 7టీలో లాగా కాకుండా వన్ ప్లస్ 7టీ ప్రోలో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉంది. దాని ధరను రూ.53,999గా నిర్ణయించారు. వన్ ప్లస్ 7టీ ప్రో కేవలం హేజ్ బ్లూ కలర్ వేరియంట్ లో మాత్రమే లభించనుంది. దీనికి సంబంధించిన సేల్ అక్టోబర్ 12న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్, వన్ ప్లస్ ఆఫ్ లైన్ స్టోర్లలో ప్రారంభం కానుంది. దేశంలో ఉన్న 8 వన్ ప్లస్ ఎక్స్ క్లూజివ్ స్టోర్లలో ఒక్క రోజు ముందుగా అంటే అక్టోబర్ 11న మధ్యాహ్నం 12 గంటలకు ఒక స్పెషల్ సేల్ నిర్వహించనున్నారు. ఆన్ లైన్ లో ఎటువంటి స్పెషల్ సేల్ ను నిర్వహించబోవడం లేదు.

వన్ ప్లస్ 7టీ ప్రో లో 6.67 అంగుళాల AMOLED డిస్ ప్లే అందించారు. దీని రిజల్యూషన్ 3120×1440 పిక్సెల్స్ గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కావడం విశేషం. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇందులో అత్యంత వేగవంతమైన క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ ను ఉపయోగించారు. వన్ ప్లస్ 7టీలా కాకుండా ఇందులో వెనకవైపు మూడు కెమెరాలను నిలువుగా అమర్చారు. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్586 సెన్సార్ ను ఉపయోగించారు. 16 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో 117 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ వరకు కవర్ చేయవచ్చు.

అలాగే టెలిఫొటో లెన్స్ సామర్థ్యం 8 మెగా పిక్సెల్ గా ఉంది. ఇక సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్471 పాపప్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇందులో 4085 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. Warp Charge 30T ఫీచర్ కూడా ఉండటంతో చార్జింగ్ అత్యంత వేగంగా ఎక్కుతుంది. ఇక ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్ లాక్, డాల్బీ అట్మాస్, హెచ్ డీఆర్ 10+ వంటి ఫీచర్లను కూడా ఇందులో అందించారు. దీనికి సంబంధించిన అమ్మకాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Related Tags