తెలంగాణలో మరో ఎన్నికల నగారా

తెలంగాణ రాష్ట్రంలో అటు మునిసిపల్ ఎన్నికలు ముగిసాయో లేదో ఇటు మరో ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి నెల 15వ తేదీ దాకా తెలంగాణలో మరో సారి ఎన్నికల వాతావరణం కొనసాగబోతోంది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను గురువారం సాయంత్రం విడుదల చేశారు. జనవరి నెలంతా తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల వేడి కొనసాగింది. 120 మునిసిపాలిటీలకు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు హోరోహోరీ తలపడ్డాయి. అయితే.. ఎవరెంత ప్రయత్నం చేసినా […]

తెలంగాణలో మరో ఎన్నికల నగారా
Follow us

|

Updated on: Jan 30, 2020 | 7:24 PM

తెలంగాణ రాష్ట్రంలో అటు మునిసిపల్ ఎన్నికలు ముగిసాయో లేదో ఇటు మరో ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి నెల 15వ తేదీ దాకా తెలంగాణలో మరో సారి ఎన్నికల వాతావరణం కొనసాగబోతోంది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను గురువారం సాయంత్రం విడుదల చేశారు.

జనవరి నెలంతా తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల వేడి కొనసాగింది. 120 మునిసిపాలిటీలకు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు హోరోహోరీ తలపడ్డాయి. అయితే.. ఎవరెంత ప్రయత్నం చేసినా అధికార టీఆర్ఎస్ పార్టీని నిలువరించలేకపోయాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. 99శాతం మునిసిపల్ ఛైర్మెన్ పదవులను, వందశాతం కార్పొరేషన్ మేయర్ పదవులను టీఆర్ఎస్ దక్కించుకుంది. ఈ తంతు జనవరి నెలాఖరుదాకా కొనసాగగా.. గురువారం మరో ఎన్నికలకు తెరలేచింది.

తెలంగాణలోని ప్రాథమిక సహకార సంఘాలకు ఫిబ్రవరి 15న ఎన్నికలు నిర్వహించేందుకు సంబంధించిన షెడ్యూల్‌ను సహకార శాఖ అదనపు రిజిష్ట్రార్ విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆరో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 9న స్క్రూటినీ నిర్వహిస్తారు. ఫిబ్రవరి పదో తేదీన ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 15వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఒంటి గంట తర్వాత ఓట్లను లెక్కించి అదే రోజున ఫలితాలను వెల్లడిస్తారు.

ప్రాథమిక సహకార సంఘాలకు పరోక్ష పద్దతిలో ఎన్నికలు జరుగుతాయి. పరపతి సంఘాల్లో సభ్యులైన రైతులు ముందుగా డైరెక్టర్లను ఎన్నుకుంటారు. సభ్యుల ఓట్లతో ఎన్నికైన డైరెక్టర్లలో ఒకరిని సహకార సంఘాలకు ఛైర్మెన్ ఎన్నుకుంటారు. ఫిబ్రవరి 15వ తేదీన ఎన్నికైన డెరెక్టర్లు ఆ తర్వాత మూడు రోజుల్లో పీఏసీసీఎస్ ఛైర్మెన్లను ఎన్నుకోవాల్సి వుంటుందని సహకార శాఖ అదనపు రిజిష్ట్రార్ తెలిపారు.