నెట్ లేకుండా ‘వాట్సాప్‌’.. ఎలా..?

యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో ఫీచర్‌ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఒక అకౌంట్‌ను ఒకేసారి రెండు వేర్వేరు ఫ్లాట్‌ఫాంలో పనిచేసే వీలుగా మరో కొత్త ఆప్షన్‌ను వాట్సాప్ తేనుంది. మామూలుగా వెబ్ వాట్సాప్‌ను ఉపయోగించి.. ఫోన్‌లో, డెస్క్‌టాప్‌ మీద ఒకేసారి వాట్సాప్‌ను మనం వాడుకునే వెసులుబాటు ఇప్పుడు ఉంది. అయితే ఇలా వాడుకోవాలనుకుంటే మన ఫోన్‌లో కచ్చితంగా నెట్ ఉండాలి. అంతేకాదు దీని వలన […]

నెట్ లేకుండా ‘వాట్సాప్‌’.. ఎలా..?
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2019 | 12:46 PM

యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో మరో ఫీచర్‌ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఒక అకౌంట్‌ను ఒకేసారి రెండు వేర్వేరు ఫ్లాట్‌ఫాంలో పనిచేసే వీలుగా మరో కొత్త ఆప్షన్‌ను వాట్సాప్ తేనుంది. మామూలుగా వెబ్ వాట్సాప్‌ను ఉపయోగించి.. ఫోన్‌లో, డెస్క్‌టాప్‌ మీద ఒకేసారి వాట్సాప్‌ను మనం వాడుకునే వెసులుబాటు ఇప్పుడు ఉంది. అయితే ఇలా వాడుకోవాలనుకుంటే మన ఫోన్‌లో కచ్చితంగా నెట్ ఉండాలి. అంతేకాదు దీని వలన ఫోన్ బ్యాటరీకి కూడా తగ్గిపోతుంటుంది. కానీ త్వరలో రానున్నకొత్త ఫీచర్‌తో మన ఫోన్‌లో నెట్ లేకుండానే డెస్క్‌టాప్‌ మీద వాట్సాప్‌ను వాడుకోవచ్చు. అందుకోసం UWP అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని వలన మన ఫోన్‌లోని బ్యాటరీ లైఫ్‌ను సేవ్ చేసుకోవచ్చు.

ఇక ఈ వారంలోనే ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వర్షన్‌లో తీసుకురానున్నారని.. త్వరలోనే అన్ని వాట్సాప్‌లలో అందుబాటులోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై వాట్సాప్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం వాట్సాప్‌లో కొన్ని మార్పులు జరుగుతున్నాయని.. త్వరలో ఈ కొత్త ఫీచర్‌ రావొచ్చని ఆ సంస్థ వర్గాల సమాచారం.