Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 22 వేల 771 మంది వైరస్​ సోకింది. మరో 442 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,35,433. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,94,227. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,655.
  • తెలంగాణలో ప్రజా ప్రతినిధులను వణికిస్తున్న కరోనా. ప్రగతి భవన్‌లో 30మందికిపైగా సిబ్బందికి కరోనా మరో 15రోజులపాటు ప్రగతి భవన్‌కు సీఎం దూరం. నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా- కోలుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు. యశోదలో చికత్స పొందుతున్న మహిళా ఎమ్మెల్యే. డిశ్చార్చి అయిన రాష్ట్ర హోంమంత్రి. హోం క్వారెంటైన్‌లోనే డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు. కరోనా వచ్చిన వెల్లడించని ఐదుగురికిపైగా ఎమ్మెల్యేలు. హోంక్వారైంట్‌న్‌లో చికిత్స.
  • తిరుమల: టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం. టిటిడి బోర్డ్ మీటింగ్ ని ఇకపై ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయం . ఇకపై జరిగే అన్ని బోర్డ్ మీటింగులను అసెంబ్లీ సమావేశాల మాదిరి ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. బోర్డ్ మీటింగ్ లో జరిగే చర్చ అంతా పారదర్శకంగా ప్రజలందరికీ తెలిసేలా ప్రత్యక్ష ప్రసారం.
  • నల్లగొండ: రాంగోపాల్ వర్మ నిర్మించబోయే మర్డర్ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి బాలస్వామి. సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఆయన ఫిర్యాదు దాఖలు .దీనిపై స్పందించిన ఎస్సీ ఎస్టీ కోర్టు. రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులను ఆదేశించిన ఎస్సీ ఎస్టీ కోర్టు.
  • నిర్మాత పోకూరి రామారావు ఈరోజు ఉదయం కరోన కారణంగా మృతి చెందారు. పోకూరి రామారావు పోకూరి బాబురావు సోదరుడు. ఈతరం ఫిలిమ్స్ లో ఎన్నో చిత్రాలు తీశారు.
  • యాదాద్రి: ప్రభుత్వ విప్ గొంగిడి సునీత భర్త, నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేసిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్ధారించిన డాక్టర్లు. నిన్న ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు, ఇద్దరు డ్రైవర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ.

పెట్రోల్, గ్యాస్‌, కిరోసిన్ డీలర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్!

'One Time License' to dealers of LPG Kerosene and Petrol Bunks in Telangana, పెట్రోల్, గ్యాస్‌, కిరోసిన్ డీలర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్!
తెలంగాణలో ఉన్న పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, కిరోసిన్ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఏటా తమ లైసెన్సులు రెన్యూవల్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు రెన్యువల్ నుంచి మినహాయింపు కల్పిస్తూ తెలంగాణ పౌరసరఫరాల శాఖ గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. డీలర్ షిప్ కోసం ఒకసారి లైసెన్స్‌ తీసుకున్నవారు ప్రతి ఏడాది రెన్యువల్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భాగంగా వన్‌ టైమ్‌ లైసెన్స్‌ సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, కిరోసిన్‌ డీలర్లు తమ లైసెన్సులను జిల్లా పౌరసరఫరాల శాఖ నుంచి ప్రతి ఏడాది లేదా మూడేళ్లొకొసారి రెన్యువల్‌ చేసుకోవాలన్న నిబంధన అమల్లో ఉండేది. ఈ విధానం నుంచి తమకు మినహాయింపు ఇచ్చి, వన్‌టైమ్‌ లైసెన్స్‌కు అవకాశం కల్పించాలని పెట్రోల్‌ బంక్‌, కిరోసిన్‌, ఎల్‌పీజీ డీలర్లు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

డీలర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ అంశంపై అధ్యయనం చేయాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. అధ్యయనం చేసి వన్‌ టైమ్‌ లెసెన్స్‌ ఇవ్వడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. దీంతో సీఎం కేసీఆర్ ఇటీవలే వన్‌ టైమ్‌ లైసెన్స్‌కు ఆమోదం తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం కూడా సమ్మతి తెలిపింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పెట్రోలియం ప్రాడక్ట్‌ (లైసెన్సింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ సప్లయిస్‌ ఆర్డర్‌ 2016)లో అందుకు అనుగుణంగా సవరణలు చేస్తూ గురువారం నాడు పౌరసరఫరాల శాఖ జీ.వో. నెం. 15ను విడుదల చేసింది.

రాష్ట్రంలో ఉన్న దాదాపు 2553 పెట్రోల్‌ బంకులు, 723 ఎల్పీజీ డీలర్లు, 900 వరకు ఉన్న కిరోసిన్‌ డీలర్లకు ఈ జీవో వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఈ జీవో విడుదల పట్ల పెట్రోల్‌ బంక్‌, ఎల్‌పీజీ, కిరోసిన్‌ డీలర్ల అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపింది.

Related Tags