ఉమ్మడి అర్హతా పరీక్షల నిర్వహణకు వెయ్యి కేంద్రాలు !

దేశంలోని 700 జిల్లాల్లో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు వెయ్యి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజన్సీ..

ఉమ్మడి అర్హతా పరీక్షల నిర్వహణకు వెయ్యి కేంద్రాలు !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 24, 2020 | 8:42 PM

దేశంలోని 700 జిల్లాల్లో కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు వెయ్యి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజన్సీ కింద వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. మొదట 12 భాషల్లోనూ ఆ తరువాత మరిన్ని భాషల్లోనూ ఈ ఉమ్మడి అర్హతా పరీక్షలను నిర్వహించే యోచన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక కోసం ఆన్ లైన్ సీఈటీ ని నిర్వహించాలని , ఇందుకు నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజన్సీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం ఈ నెల 19 న నిర్ణయించింది.