Breaking News
  • మద్యం ఎక్కువ వినియోగం ఉన్న ప్రాంతాల్లో.. మద్యం షాపులను తగ్గించలేదు-అచ్చెన్నాయుడు. సేల్స్ లేని చోట మాత్రమే షాపులు తగ్గించారు-అచ్చెన్నాయుడు.
  • ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.
  • గుంటూరు: మైనర్‌ బాలికపై అత్యాచార ఘటన చాలా బాధాకరం. అసెంబ్లీలో దిశ బిల్లు పెట్టిన రోజే ఘటన జరగడం దారుణం-చంద్రబాబు దిశ చట్టం తెచ్చారు.. 21 రోజుల్లో ఉరి అన్నారు మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు దిశ విషయంలో చూపిన శ్రద్ధ.. మైనర్‌ బాలికపై ఎందుకు చూపడంలేదు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. బాధిత కుటుంబానికి టీడీపీ తరపున రూ.50 వేల ఆర్థికసాయం-చంద్రబాబు.
  • ఆర్టీసీ విలీనంపై టైమ్‌బాండ్‌ పెట్టి కమిటీని నియమించాం-పేర్ని నాని. కమిటీ నివేదిక వచ్చాక ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై కొత్త చట్టం తెస్తున్నాం. 200 రోజుల్లోనే జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు-పేర్ని నాని. ఆర్టీసీ విలీనంతో ప్రభుత్వంపై రూ.3,600 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. జనవరి 1లోగా ప్రజా రవాణాశాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం-పేర్ని నాని.
  • రేపు యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ పర్యటన.
  • జులై 1వ తేదీ నాటికి 4,380 షాపులు ఉన్నాయని ఎక్సైజ్‌శాఖ నివేదిక. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 20శాతం మద్యం షాపులు తగ్గించాం. ప్రస్తుతం 3,456 షాపులకు కుదించాం-సీఎం జగన్‌. 43 వేల బెల్ట్‌ షాపులను ఎత్తివేశాం-సీఎం జగన్‌. ఒక్క బెల్ట్‌షాపు కూడా లేకుండా చేశామని గర్వంగా చెబుతున్నా-జగన్. సభను తప్పుదోవ పట్టించేలా అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారు. అచ్చెన్నాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నా-జగన్‌. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం-సీఎం జగన్‌. ప్రభుత్వమే షాపులు నిర్వహిస్తోంది, టైమ్‌ కూడా కుదించాం-జగన్‌. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టేలా ఉంటాయని పాదయాత్రలో చెప్పా. పాదయాత్రలో చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం-జగన్‌. బార్లను 40 శాతం తగ్గించాం-సీఎం జగన్‌.

అదిరిపోయే ఫీచర్స్‌తో వన్‌ ప్లస్‌ 7 టి

one plus 7t mobile lunch with best features and specifications, అదిరిపోయే ఫీచర్స్‌తో వన్‌ ప్లస్‌ 7 టి

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్‌ ప్లస్‌ 7 టీ సిరీస్‌ను లాంచ్‌ చేయబోతోంది. రాత్రి 7 గంటలకు వన్‌ ప్లస్‌ 7టీ, వన్‌ ప్లస్‌ 7 టీ ప్రో, వన్‌ ప్లస్‌ టీవీలను విడుదల చేయనుంది. ఈ ఏడాది మేలో విడుదలైన వన్‌ ప్లస్‌ 7, వన్ ప్లస్‌ 7 ప్రోలకు సక్సెసర్‌ వర్షన్లుగా ఈ ఫోన్లు లాంచ్‌ కానున్నాయి. అద్భుతమైన ఫీచర్స్‌తో ఈ మోడల్స్‌ను మనముందుకు తీసుకొస్తోంది వన్‌ప్లస్‌. ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో రిలీజ్‌ కానున్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ వన్ ప్లస్‌ టి అన్న ప్రచారం జరుగుతోంది.

*ఈ రెండు మోడల్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ బ్యాటరీతో లభించనున్నాయి వన్‌ప్లస్‌ 7టి ప్రో 8GB RAM, 256 GB ధర రూ.52,999 ఉండొచ్చని తెలుస్తోంది. వన్‌ప్లస్‌ 7టి ప్రో 4,080 ఎంఎహెచ్‌ బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్‌ మోడ్‌లో ఉంటుంది. క్వాల్‌ కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌, నాచ్డ్‌ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ 10 అప్‌డేట్‌ వెర్షన్‌తో లభించనుంది. 48 మెగా పిక్సెల్‌-16మెగా పిక్సెల్‌, 12 మెగా పిక్సెల్‌ రియల్‌ కెమేరా, 1080X2340పిక్సెల్స్‌ స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. వన్‌ప్లస్‌ 7టి 3,800ఎంఎహెచ్‌ బ్యాటరీ, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, ధర రూ. 32,999

*వన్‌ ప్లస్‌ టీవీని కూడా లాంచ్‌ చేయబోతోంది వన్‌ప్లస్‌. వన్‌ ప్లస్‌ టీవీని 55 INCH, అల్ట్రా హెచ్‌డీతో తీసుకొస్తున్నారు. వన్‌ప్లస్‌ టీవీ మరో అద్భుతమైన ఫీచర్‌తో వస్తోంది. టీవీకి కనెక్టైన ఫోన్‌కు కాల్‌ వస్తే ఆటోమేటిక్‌గా టీవీ వాల్యూమ్‌ మారిపోయేలా డిజైన్‌ చేశారు. *అమెజాన్‌లో సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 4 వరకు జరగనున్న గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా ఇవి మొదటిసారి మార్కెట్‌లోకి రానున్నాయి. వీటిని ఉచితంగా గెలుచుకోవడానికి వన్‌ ప్లస్‌, అమెజాన్‌ ఒక అవకాశం కల్పిస్తోంది. అయితే దానికి మీరు వన్‌ ప్లస్‌ 7టీ, వన్‌ ప్లస్‌ టీవీ స్పెసిఫికేషన్లను సరిగా గెస్‌ చేయాలి. సరైన సమాధానమిస్తే మీరు వన్ ప్లస్‌ 7టిని గెలుచుకోవచ్చు.