కేంద్రం గుడ్ న్యూస్ : వ్యవసాయ సదుపాయాలకు ఒక్క శాతం వడ్డీకే రుణాలు

దేశ చరిత్రలోనే మ‌రో చారిత్ర‌క అడుగుకు కేంద్రం శ్రీకారం చ‌ట్ట‌బోతుంది. ప్రయోగాత్మకంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఒక్క శాతం వడ్డీకే రుణాలిచ్చేందుకు ప్ర‌ణాళిక రెడీ అయింది.

కేంద్రం గుడ్ న్యూస్ : వ్యవసాయ సదుపాయాలకు ఒక్క శాతం వడ్డీకే రుణాలు
Follow us

|

Updated on: Aug 04, 2020 | 8:14 PM

Central Loans For Farmers : దేశ చరిత్రలోనే మ‌రో చారిత్ర‌క అడుగుకు కేంద్రం శ్రీకారం చ‌ట్ట‌బోతుంది. ప్రయోగాత్మకంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఒక్క శాతం వడ్డీకే రుణాలిచ్చేందుకు ప్ర‌ణాళిక రెడీ అయింది. గ్రామాల్లో వ్యవసాయ, మార్కెటింగ్‌ మౌలిక సదుపాయాలను మెరుగుప‌ర‌చ‌డానికి ఈ నిధులు ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఒక్కో సంఘానికి గరిష్ఠంగా రూ.2కోట్ల వరకూ ఇవ్వాలని డిసైడ‌య్యారు. క‌రోనా సంక్షోభంలో వ్యవసాయ రంగం ఇబ్బందులు ఎదుర్కోకుండా ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ పథకం కింద కేంద్రం రూ.లక్ష కోట్లను కేటాయించింది. వీటిని ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’ పేరిట వినియోగించాల‌ని నిర్ణ‌యించింది. మూడేళ్ల(2020-23)లోగా దేశంలోని అన్ని వ్యవసాయ సహకార సంఘాలకు రుణం అందజేయాలని బ్యాంకులన్నింటికీ కేంద్రం సూచించింది. ఈ క్రమంలో నాబార్డు ద్వారా ఈ నిధిని రుణాలుగా ఇచ్చేందుకు రంగం సిద్దం చేశారు. సహకార సంఘాలకు ప్రత్యేకంగా రూ.5000 కోట్లు కేటాయించారు. తెలంగాణలో మొత్తం 905 సహకార సంఘాలు ఉండ‌గా.. ఒక్కోటీ రూ.2 కోట్ల వంతున గరిష్ఠంగా రూ.1810 కోట్ల రుణాలు పొందడానికి అవకాశముంటుంది.

రుణాలు పొందడానికి నాబార్డు కొన్ని మార్గ‌నిర్దేశ‌కాలు విడుద‌ల చేసింది. ప్రతీ సంఘం తన పరిధిలోని గ్రామాల ప్రజలకు సేవలన్నీ అందించే ‘బహుళ సేవా కేంద్రం’గా మారవచ్చు. మ‌చ్చుకకు చెప్పుకోవాలంటే లైసెన్సులు ల‌భిస్తే పెట్రోలు బంకు, గ్యాస్‌ ఏజెన్సీ వంటివి పెట్టుకోవచ్చు. వ్యవసాయోత్పత్తులు, నిత్యావసర వస్తువుల తయారీ, స్టోరేజీ, విక్రయ సెంట‌ర్స్  స్టార్ట్ చేయ‌వ‌చ్చు. రైతుల పంటలను పొలం వద్దనే కొని శుద్ధి, నిల్వ చేసి తిరిగి అమ్ముకునే గ్రామీణ మార్కెట్‌ కేంద్రంగా వీటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోడానికి లోన్ ఇస్తారు.

ఈ లోన్స్ ఎలా ఇస్తారంటే

నాబార్డు రాష్ట్ర సహకార బ్యాంకులకు 3 ప‌ర్సెంట్ ఇంట్ర‌స్ట్ కు నిధులిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు‌ శాఖలు, డీసీసీబీ శాఖల ద్వారా వాటిని ప్యాక్స్‌కు 4 శాతానికి లోన్స్ కింద ఇవ్వాలి. ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నందుకు ఒక శాతం డబ్బును సహకార బ్యాంకులు చార్జీలుగా తీసుకుంటాయి. ప్రతీ సంఘం లోన్ తో నిర్మించిన నిర్మాణాలపై వచ్చే ఆదాయంతో ఏడేళ్లలోగా అప్పును తిరిగి పే చెయ్యాలి. ఇలా చేస్తే ఆత్మ నిర్భర్‌ కింద అవి చెల్లించే 4 శాతంలో 3 శాతం ఇంట్రస్ట్ ని రాయితీగా కేంద్రం భరిస్తుంది. అంటే చివరికి ఒక్క శాతానికే లోన్ పొందినట్లవుతుంది. సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ స్కీమ్స్ కింద‌ ప్యాక్స్ లోన్స్ పొందాలంటే ప్రాజెక్టు వ్యయంలో 10 శాతాన్ని సంఘం వాటాగా పెట్టాలి. కానీ కొన్ని సంఘాల ఆర్థిక పరిస్థితి స‌రిగా లేనందున‌ ఈ శాతానికి సగానికి సగం తగ్గించి 5 శాతమే తీసుకోవాలని నాబార్డు సూచించింది.

Read More : వారికి రూ.15వేలు సాయం : జ‌గ‌న్ స‌ర్కార్ సంచ‌ల‌న జీవో రిలీజ్

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..