గుర్రుగుర్రుగా గుత్తా, జగదీశ్…గులాబీ శ్రేణుల్లో పరేషాన్

నల్గొండ జిల్లా గులాబీ పార్టీలో నయా పంచాయతీ మొదలైంది. ఒకనేత పర్యటన ఇంకో నేతకు నచ్చక పోవడంతో గులాబీ శ్రేణులు పరేషాన్ అవుతున్నాయి. ఒకరుండగా ఇంకొకరు వస్తే ఒకరి వైపు ఇంకొకరు గుర్రుగా చూసుకునే పరిస్థితి కనిపిస్తుందని టిఆర్ఎస్ వర్గాలు మధనపడుతున్నాయి. పెద్ద మనిషిగా ఉండాల్సిన ఆయనకు రాజకీయాలు ఎందుకు అని ఒకాయన ప్రశ్నిస్తుంటే.. ఇదేమీ పట్టనట్లు ఆయన తన పని తాను చేసుకుపోతూ వున్నాడట. వీరిద్దరి ఈ పంచాయితీ ఎటు దారితీస్తుందో అన్న ఆందోళన గులాబీ […]

గుర్రుగుర్రుగా గుత్తా, జగదీశ్...గులాబీ శ్రేణుల్లో పరేషాన్
Follow us

|

Updated on: Nov 27, 2019 | 7:00 PM

నల్గొండ జిల్లా గులాబీ పార్టీలో నయా పంచాయతీ మొదలైంది. ఒకనేత పర్యటన ఇంకో నేతకు నచ్చక పోవడంతో గులాబీ శ్రేణులు పరేషాన్ అవుతున్నాయి. ఒకరుండగా ఇంకొకరు వస్తే ఒకరి వైపు ఇంకొకరు గుర్రుగా చూసుకునే పరిస్థితి కనిపిస్తుందని టిఆర్ఎస్ వర్గాలు మధనపడుతున్నాయి. పెద్ద మనిషిగా ఉండాల్సిన ఆయనకు రాజకీయాలు ఎందుకు అని ఒకాయన ప్రశ్నిస్తుంటే.. ఇదేమీ పట్టనట్లు ఆయన తన పని తాను చేసుకుపోతూ వున్నాడట. వీరిద్దరి ఈ పంచాయితీ ఎటు దారితీస్తుందో అన్న ఆందోళన గులాబీ దళంలో కనిపిస్తోంది.

నల్గొండ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకరికి మించి మరొకరు ఎత్తులకు…పై ఎత్తులు వేస్తూ రాజకీయం రక్తి కట్టిస్తున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలు కొందరికి నచ్చడం లేదట. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి… జిల్లాకు దూరంగా ఉంటారని ఆయన ప్రత్యర్థులు ఊహించారు.. కానీ ఆయన మాత్రం పర్యటనలు మీద పర్యటనలు చేస్తున్నారు. దీంతో ఆయనకు ఎలా చెక్‌ పెట్టాలా? అని పార్టీలోని ప్రత్యర్థులు ఆలోచిస్తున్నారట.

నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. మారిన రాజకీయ సమీకరణాలలో తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు కెసీఆర్. ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి జగదీష్ రెడ్డి తెలంగాణ కేబినెట్‌లో ఉన్నారు. గుత్తా పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఇద్దరికి పొసగడం లేదన్న ప్రచారం పార్టీతో పాటు జిల్లాలో నడుస్తోంది. అయితే ఈ ఇద్దరు నేతలు ఎప్పటికప్పుడు ఆ ప్రచారంలో నిజం లేదని చెబుతూ నెట్టుకొస్తున్నారు.

మండలి చైర్మన్‌గా గుత్తా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెగ్యులర్‌గా పర్యటనలు చేస్తున్నారు. వారంలో 5 రోజులు అక్కడే ఉంటూ ప్రజల మధ్య తిరుగుతున్నారు. మండలి చైర్మన్ అయిన తర్వాత గుత్తా హైదరాబాద్‌కే పరిమితం అవుతారని ప్రత్యర్థులు భావించారు. కానీ ఇప్పుడు ఆయన తీరు పార్టీలో కొందరికి మింగుడు పడడం లేదన్న ప్రచారం సూర్యాపేట జిల్లాలో జరుగుతుందట.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో సొంత వర్గాన్ని కాపాడుకునేందుకు గుత్తా జిల్లా పర్యటనలు చేస్తున్నారన్న అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇటు సొంత వర్గం కూడా గుత్తాను తమకు అందుబాటులో ఉండాలని కోరుతున్నారట. దీంతో గుత్తా దాదాపు జిల్లాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. మంత్రి పదవి ఆశించిన గుత్తా, ఇప్పుడున్న పదవి మంత్రి పదవి కన్న పెద్దది కావడంతో ఆయన మరింత చురుగ్గా జిల్లాలో తిరగడం జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డికి మింగుడు పడటం లేదట.

గుత్తాకు కేబినెట్‌లో చోటు లేదు కాబట్టి ఇక నల్గొండ జిల్లాలో ఏకచ్ఛత్రాధిపత్యం తనదే అనుకున్న జగదీశ్ రెడ్డికి ఇప్పుడు గుత్తా పర్యటనలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు జిల్లాలో పోటాపోటీ రాజకీయాలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.