షాకింగ్‌ ఘటన.. సాధువుల హత్య కేసులో నిందితుడికి కరోనా..

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పాల్‌ఘర్‌లో సాధువులపై జరిగిన మూకదాడి గురించి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు సాధువులు ప్రాణాలు కోల్పోగా.. ఓ డ్రైవర్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మూకదాడికి సంబంధించిన కేసులో ఇప్పటికే 115 మంది అరెస్ట్ అయ్యారు. అయితే వీరిలో 9 మంది మైనర్లు కావడంతో వారిని జువైనల్‌కు తరలించగా.. మిగతా వారిని కస్టడీలో ఉన్నారు. అయితే వీరిలో ఇప్పుడు ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. కలకలం రేగుతోంది. ఏప్రిల్ […]

షాకింగ్‌ ఘటన.. సాధువుల హత్య కేసులో నిందితుడికి కరోనా..
Follow us

| Edited By:

Updated on: May 02, 2020 | 4:23 PM

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పాల్‌ఘర్‌లో సాధువులపై జరిగిన మూకదాడి గురించి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు సాధువులు ప్రాణాలు కోల్పోగా.. ఓ డ్రైవర్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మూకదాడికి సంబంధించిన కేసులో ఇప్పటికే 115 మంది అరెస్ట్ అయ్యారు. అయితే వీరిలో 9 మంది మైనర్లు కావడంతో వారిని జువైనల్‌కు తరలించగా.. మిగతా వారిని కస్టడీలో ఉన్నారు. అయితే వీరిలో ఇప్పుడు ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. కలకలం రేగుతోంది.

ఏప్రిల్ 16 వ తేదీన రాత్రి పాల్‌ఘర్ ప్రాంతంలో సాధువులపై జరిగిన మూకదాడికి పాల్పడి ముగ్గుర్ని చంపేశారు అక్కడి గ్రామస్థులు. అయితే ఈ కేసులో ప్రస్తుతం వందమందికి పైగా పోలీసుల అదుపులోనే ఉన్నారు. వీరిలో ఇప్పుడు ఒక నిందితుడికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. వెంటనే నిందితుడిని స్థానిక ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి జేజే ఆసుపత్రిలోని ఓ నిర్బంధ ఐసోలేషన్ వార్డులోకి చేర్చారు. అక్కడే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఆ నిందితుడితో పాటు.. గదిలో 20 మంది ఉంటున్నట్లు తెలుస్తోంది. వారిలో కూడా ఎవరికో కరోనా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో పోలీసుల అదుపులో ఉన్న మిగతా వారందరికీ కరోనా టెస్టులు చేసేందుకు రెడీ అయ్యారు.