ఒకే దేశం..ఒకే ఎన్నికలు..స్లోగన్ ఎప్పటిది ?

one nation-one election, ఒకే దేశం..ఒకే ఎన్నికలు..స్లోగన్ ఎప్పటిది ?

‘ ఒకే దేశం.. ఒకే ఎన్నికలు ‘ అన్న అంశంపై చర్చించేందుకు ప్రధాని మోదీ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి విపక్షాల్లో చాలా వరకు నేతలు గైర్ హాజరయ్యారు. సుమారు రెండు దశాబ్దాలుగా ఆర్ ఎస్ ఎస్-బీజేపీ ఇఛ్చిన నినాదమిది ! ఈ స్లోగన్ పూర్వాపరాల్లోకి వెళ్తే.. 1967 లో జరిగిన లోక్ సభ ఎన్నికల వరకు జమిలి ఎన్నికలను ఆయా ప్రభుత్వాలు నిర్వహిస్తూ వచ్చ్చాయి. 1990 ప్రాంతంలో నాటి ప్రధాని (దివంగత) వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో ఈ ప్రతిపాదనపై పెద్ద చర్చే జరిగింది. జమిలి ఎన్నికలను నిర్వహించడం వల్ల ఎన్నికల వ్యయం భారీగా తగ్గుతుందన్నది ముఖ్య సూచన. 1951-1967 మధ్యకాలంలో ఇలా ఏకకాల ఎన్నికలను నిర్వహించారు. లోక్ సభ ఎన్నికలను పూర్తిగానో, అసెంబ్లీ ఎన్నికలను దాదాపు (ఇప్పటిలా) పాక్షికంగానో నిర్వహించారు. 1951-52ప్రాంతంలో రాష్ట్రాల పునర్విభజన, ప్రభుత్వాల రద్దు వంటి పరిణామాల కారణంగా ఓటింగ్ శాతం చాలావరకు (76 శాతం) తగ్గిపోయింది. ఆ క్రమంలో మెల్లగా 1970 నాటికి ఈ ‘ లింక్ ‘ విడిపోయింది. ఇక 1990 లో ఆర్ ఎస్ ఎస్, బీజేపీ తిరిగి ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి. నాడు బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ ఈ నినాదాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. 1999 లో లా కమిషన్ తన నివేదికలో జమిలి ఎన్నికలను సిఫారసు చేసింది. ఒక ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు.. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు అనువుగా పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించేలా తీర్మానం అవసరమని లా కమిషన్ అప్పట్లో  అభిప్రాయపడింది.

తాజాగా  మోదీ ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రతిపాదనను జాతీయ స్థాయిలో తెరపైకి తెచ్చినప్పటికీ ప్రధాన ప్రతిపక్షాల్లో కొన్ని దీన్ని వ్యతిరేకిస్తూ.. మోదీ ఏర్పాటు చేసిన అఖిల పక్షసమావేశానికి గైర్ హాజరవడం తిరిగి ఇది కోల్డ్ స్టోరేజీలోకి వెళ్తుందా అన్న సందేహాలను లేవనెత్తింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *