బ్రేకింగ్: చైనాను వణికిస్తున్న మరో వైరస్..

One More Virus In China: భయంకరమైన కరోనా వైరస్ మహమ్మారితో డ్రాగన్ కంట్రీ ప్రజలు ఎంతోమంది చనిపోతుంటే.. తాజాగా మరో వైరస్ వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. హునన్ ప్రావిన్సులో బర్ద్ ఫ్లూ ఆనవాళ్లను గుర్తించినట్లు ఆ దేశ వ్యవసాయశాఖ మంత్రి తెలిపారు. షయోయాంగ్ నగరం శివారులోని ఓ కోళ్లఫారంలో ఈ వైరస్ ధాటికి సుమారు 5,000 కోళ్లు మరణించినట్లు ధృవీకరించారు. కాగా, ఈ ఫ్లూ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని.. దీని వల్ల ఇప్పటివరకు […]

బ్రేకింగ్: చైనాను వణికిస్తున్న మరో వైరస్..
Follow us

|

Updated on: Feb 02, 2020 | 2:48 PM

One More Virus In China: భయంకరమైన కరోనా వైరస్ మహమ్మారితో డ్రాగన్ కంట్రీ ప్రజలు ఎంతోమంది చనిపోతుంటే.. తాజాగా మరో వైరస్ వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. హునన్ ప్రావిన్సులో బర్ద్ ఫ్లూ ఆనవాళ్లను గుర్తించినట్లు ఆ దేశ వ్యవసాయశాఖ మంత్రి తెలిపారు. షయోయాంగ్ నగరం శివారులోని ఓ కోళ్లఫారంలో ఈ వైరస్ ధాటికి సుమారు 5,000 కోళ్లు మరణించినట్లు ధృవీకరించారు.

కాగా, ఈ ఫ్లూ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని.. దీని వల్ల ఇప్పటివరకు మనుషులెవరూ చనిపోలేదని అధికారులు వెల్లడించారు. ఇక ఈ వైరస్ బారిన చైనా దేశం ఒక్కటే పడలేదు. గతవారం ఇండియాలోని అధికారులు బర్ద్ ఫ్లూ భయంతో కొన్ని లక్షల కోళ్లను మట్టుబెట్టడమే కాకుండా గుడ్లను సైతం నాశనం చేశారు. ఇటీవల కాలంలో ఈస్టర్న్ యూరోప్ దేశాల్లో కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందింది. కాగా, 2013లో బర్డ్ ఫ్లూ వల్ల సుమారు 6.5 బిలియన్ డాలర్ల నష్టాన్ని చైనా చవి చూసిందట.