Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 45 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 145380. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 80722. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 60491. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4167. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కరోనా తెలంగాణా బులిటిన్. ఇవ్వాళ తాజాగా 71 పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం రాష్ట్రంలో 1991 కరోనా పాజిటివ్ కేసులు . ఇవ్వాళ మృతులు 1. మొత్తం ఇప్పటివరకు 57 మంది కరోనా కు బలి అయ్యారు. యాక్టీవ్ కేసులు 650 మంది చికిత్స పొందుతున్నారు.
  • ఈ రోజు ఒకరికి CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 369 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ 141 యాక్టీవ్ కేస్ లు. 226 మంది డిశ్చార్జ్. ఇద్దరు మృతి.
  • అమరావతి: రేపు ,ఎల్లుండి టిడిపి మహానాడు. రేపు ఉదయం 10.30 కు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్న చంద్రబాబు. ప్రతినిధులను ఉద్దేశించి ప్రారంభ ఉపన్యాసం ఇవ్వనున్న టిడిపి అధినేత చంద్రబాబు. కరోనా, లాక్ డౌన్ నిబంధనలు నేపథ్యంలో జూమ్ ద్వారా ఆన్ లైన్ లో మహానాడు నిర్వహణ. ఆన్ లైన్ ద్వారా మహానాడు లో పాల్గొననున్న 14 వేల మంది ప్రతినిధులు. 14 తీర్మానాలను ఆమోదించనున్న మహానాడు.
  • అమరావతి: అధికార వికేంద్రీకరణ బిల్లు పరిశీలనకు మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీ వేయాలని ఆదేశించిన అమలు కావడం లేదని హైకోర్టులో పిటిషన్ వేసిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. 8 మంది సభ్యులతో కమిటీ వేయాలని మండలి చైర్మన్ ఆదేశించినా మండలి కార్యదర్శి అమలు చేయడం లేదని పిటిషన్ లో తెలిపిన దీపక్ రెడ్డి. నేడు విచారణ జరపనున్న హైకోర్టు.
  • హైకోర్టు జడ్జీలను కించపరుస్తూ పెట్టిన పోస్టులను హైకోర్టు సుమోటోగా స్వీకరించటంపై హర్షం వ్యక్తంచేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ప్రభుత్వం చేస్తున్న తప్పులను హైకోర్టు అడ్డుకుంటే ప్రజా ప్రతినిధులయ్యుండి సిగ్గులేకుండా హైకోర్టు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా? హైకోర్టు జడ్జిలపై పోస్టులను హైకోర్టు సుమోటోగా స్వీకరించి 49 మందికి నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తొట్టిగ్యాంగ్ ను ప్రోత్సహించటం సరికాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కేసులు పెడుతున్న ప్రభుత్వం హైకోర్టు జడ్జిలపై పోస్టులు పెట్టే వారిని ఎందుకు కాపాడుతున్నది? పోస్టులు పెట్టిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలి - రామకృష్ణ.

#COVID19 తబ్లిఘీ తర్వాత తెలంగాణకు మరో థ్రెట్… భీమ్ ఆర్మీ

తెలంగాణలో తబ్లిఘీ జమాత్ వర్కర్స్ సృష్టించిన కరోనా కలకలం ఇంకా సమసిపోకముందే తెలంగాణకు మరో ముప్పు పొంచివున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తబ్లిఘీ సంస్థ వర్కర్లతోపాటు ఈ సంస్థ వర్కర్లు కూడా పెద్ద సంఖ్యలో ఢిల్లీ నుంచి...
one more threat to telangana, #COVID19 తబ్లిఘీ తర్వాత తెలంగాణకు మరో థ్రెట్… భీమ్ ఆర్మీ

One more threat to Telangana after Tablighi: తెలంగాణలో తబ్లిఘీ జమాత్ వర్కర్స్ సృష్టించిన కరోనా కలకలం ఇంకా సమసిపోకముందే తెలంగాణకు మరో ముప్పు పొంచివున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తబ్లిఘీ సంస్థ వర్కర్లతోపాటు ఈ సంస్థ వర్కర్లు కూడా పెద్ద సంఖ్యలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ రైలులో రావడంతో వారికి కూడా కరోనా సోకి వుండవచ్చన్న భయాందోళన వ్యక్తమవుతోంది. దాంతో వారందరినీ క్వారెంటైన్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను ప్రారంభించింది.

భీమ్ ఆర్మీ.. తెలంగాణలో విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంస్థ ఇది. ఈ భీమ్ ఆర్మీకి చెందిన 11 మంది సభ్యులు గల బృందం మార్చి 13వ తేదీన ఢిల్లీకి వెళ్ళింది. అదే ట్రైన్‌లో తబ్లిఘీ సంస్థకు చెందిన వారు ప్రయాణించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. భీమ్ బృందం కూడా నాలుగురోజుల పాటు.. ఢిల్లీలో వుండి ఆజాద్ సమాజ్ పార్టీ నేత చంద్రశేఖర్ ఆజాద్‌తో పాటు వీరంతా పలువురు ఢిల్లీలోని తెలుగు మీడియా జర్నలిస్టులను కలిశారు.

ఆ తర్వాత మార్చి 17వ తేదీన భీమ్ సభ్యులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ ట్రెయిన్‌లో తిరిగి వచ్చారు. అదే రైలులో పెద్ద సంఖ్యలో తబ్లిఘీ వర్కర్లు ప్రయాణం చేశారు. ఈ భీమ్ ఆర్మీకి చెందిన 11 మందిలో ఇద్దరికి ఆల్ రెడీ కరోనా వైరస్ పాజిటివ్ రికార్డయ్యింది. దాంతో మిగిలిన తొమ్మిది మందిని క్వారెంటైన్‌లో పెట్టారు. భీమ్ ఆర్మీలో ఖమ్మంలో ఒకరికి, మహబూబాబాద్‌లో మరొకరికి కరోనా పాజిటివ్ కనిపించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ఈ భీమ్ టీమ్ సభ్యులు ఎవరెవరిని కలిశారు? ఎక్కడెక్కడ తిరిగారు అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ వీరంతా పెద్ద సంఖ్యలో తమ సంస్థ కార్యకర్తలో భేటీలు కానీ, సమాలోచనలు గానీ జరిపినట్లయితే పెద్ద సంఖ్యలో కరోనా వ్యాప్తి జరిగి వుండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ముందుగా ఈ తొమ్మిది మందిని క్వారెంటైన్‌కు తరలించామని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న తరుణంలో ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

అయితే, భీమ్ ఆర్మీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు సుజిత్ మాత్రం ఢిల్లీ ట్రెయిన్ ద్వారా తమ సభ్యులకు కరోనా సోకలేదని చెబుతున్నారు. ఢిల్లీ నుంచి తిరుగు పయనంలో ఇద్దరు కాజీపేటలో దిగిపోయి శాతవాహన ఎక్స్ ప్రెస్‌లో ఖమ్మం వెళ్ళారని వారికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చినందున, శాతవాహనలోనే కరోనా సోకి వుండొచ్చంటున్నారు సుజిత్. అదే సమయంలో మిగిలిన తొమ్మిది మంది సెల్ఫ్ క్వారెంటైన్‌లో వున్నామని, తాము హైదరాబాద్ వచ్చాక ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరినీ కల్వలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

Related Tags