చైనాకు మరో భారీ షాక్.. విద్యుత్తు పరికరాల దిగుమతిపై నిషేదం

No Power Equipment Imports:  చైనాకు మరో భారీ షాక్ తగిలింది. సరైన అనుమతి లేకుండా చైనా, పాకిస్తాన్ నుంచి ఎలాంటి విద్యుత్తు పరికరాలను దిగుమతి చేసుకోకూడదని కేంద్ర నిర్ణయించింది. దిగుమతులపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్  ఓ ప్రకటనను విడుదల చేశారు. చైనా, పాకిస్తాన్ దేశాల తీరుపై మండిపడ్డారు. చైనా, పాకిస్థాన్ దేశాలు మన దేశంలోకి చొరబడి మన సైనికులను చంపుతున్నాయని ఆయన అన్నారు. ఆ దేశాల వస్తువల దిగుమతితో అక్కడ మాత్రమే […]

  • Sanjay Kasula
  • Publish Date - 2:43 pm, Fri, 3 July 20

No Power Equipment Imports:  చైనాకు మరో భారీ షాక్ తగిలింది. సరైన అనుమతి లేకుండా చైనా, పాకిస్తాన్ నుంచి ఎలాంటి విద్యుత్తు పరికరాలను దిగుమతి చేసుకోకూడదని కేంద్ర నిర్ణయించింది. దిగుమతులపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్  ఓ ప్రకటనను విడుదల చేశారు. చైనా, పాకిస్తాన్ దేశాల తీరుపై మండిపడ్డారు. చైనా, పాకిస్థాన్ దేశాలు మన దేశంలోకి చొరబడి మన సైనికులను చంపుతున్నాయని ఆయన అన్నారు.

ఆ దేశాల వస్తువల దిగుమతితో అక్కడ మాత్రమే ఉద్యోగాల కల్పన జరుగుతున్నదని… మన దేశంలో కాదని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో చైనా, పాకిస్తాన్ దేశాల దిగుమతులకు “అనుమతి” పొందాల్సిన జాబితాలో చేర్చినట్లు ఆర్కే సింగ్ తెలిపారు. ప్రస్తుతం దేశీయ విద్యుత్తు వ్యవస్థకు అవసరమైన అన్నింటినీ మనం సొంతంగా తయారు చేసుకొంటున్నామని…. మన దేశానికి ఆ శక్తి, సామర్థ్యాలు ఉన్నాయన్నారు. విద్యుత్తు పరికరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.