వరదలో చిక్కుకున్న ముగ్గురు రైతులు.. సహాయకచర్యల్లో జిల్లా యంత్రాంగం.. ఇద్దరు సేఫ్, ఒకరు గల్లంతు

రేణిగుంట దగ్గర కుమ్మరలోపు చెరువుకు వరద ఉధృతి పెరగడంతో అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతులు చిక్కుకున్నారు. జిల్లా యంత్రాంగం అంతా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టింది. ఏడు గంటల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత ఆధికారులు ఇద్దరిని కాపాడారు.

  • Balaraju Goud
  • Publish Date - 3:13 pm, Thu, 26 November 20

రేణిగుంట దగ్గర కుమ్మరలోపు చెరువుకు వరద ఉధృతి పెరగడంతో అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతులు చిక్కుకున్నారు. జిల్లా యంత్రాంగం అంతా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టింది. ఏకంగా భారీ వృక్షాలను ముంచే స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆ సమయంలో వారిని రక్షించే అవకాశం లేకపోయింది. అందుకే నేవీ అధికారులతో మాట్లాడి హెలికాఫ్టర్‌ను తెప్పించే ప్రయత్నాలు జరిగాయి. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో అదీ సాధ్యం కాలేదు. ఇటు తమ వాళ్ల కోసం బంధువులు రోధనలు మిన్నంటాయి. ఏ క్షణం ఏమవుతుందో తెలియక… తమ వాళ్లు తమ కళ్ల ముందే చావు బ్రతుకుల మధ్య ఉన్నా… కాపాడలేని పరిస్థితి నెలకొంది. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఉదయం నుంచి అక్కడే ఉన్న అధికారులు.. ప్రవాహం తగ్గడంతో బోటుతో అక్కడి వెళ్లారు. ఏడు గంటల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ ఇద్దరిని కాపాడారు.

ఒకటి కాదు రెండు కాదు ఏడు గంటల పాటు ప్రాణాల కోసం పోరాడారు. ఓపక్క వరద మృతువులా దూసుకొస్తున్నా… ఓ చెట్టు చిటారు కొమ్మను పట్టుకుని నిలబడ్డారు. ఒక్కో చెట్టు ప్రవాహంలో కొట్టుకుపోతుంటే.. మరో చెట్టును పట్టుకుని ఎలాగోలా ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. ఓవైపు గంట గంటకు కుమ్మరలోపు చెరువుకు వరద ఉధృతి పెరుగుతోంది. అప్పటికే ముగ్గురిలో ఒకరు ప్రవాహంలో కొట్టుకుపోయారు. మరో ఇద్దరు మాత్రం చివరి వరకు ధైర్యం కోల్పోలేదు. ఇటు బంధువులకు నమ్మకం సన్నగిల్లుతున్న సమయంలో ప్రవాహం ఉధృతి తగ్గింది. అందరి మొహాల్లో ఆనందం కన్పించింది. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఉదయం నుంచి అక్కడే ఉన్న అధికారులు.. ప్రవాహం తగ్గడంతో బోటుతో అక్కడి వెళ్లారు. ఏడు గంటల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ ఇద్దరిని కాపాడారు.

నమ్మకం సన్నగిల్లుతున్న సమయంలో ఆశ చిగురించింది. మెల్లమెల్లగా వరద ఉధృతి తగ్గడం మొదలైంది. సుమారు ఏడు గంటల పాటు అదే చెట్టును పట్టుకుని ముగ్గురు రైతులు ప్రాణాలతో పోరాడారు. మధ్యలో ప్రసాద్‌ అనే ఓ రైతు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో వరద ప్రవాహం తగ్గడంతో రెస్క్యూ సిబ్బంది పడవతో చెరువు మధ్యకు వెళ్లారు. అక్కడ ఉన్న రైతులు ఇద్దరిని ఆ పడవలో ఎక్కించి ఒడ్డుకు చేర్చారు. సేఫ్‌గా ఇద్దరూ బయటపడడంతో బంధువులంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ప్రసాద్‌ అనే మరో రైతు ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబసభ్యలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.