‘ ఏలియన్ ‘ సముద్రపు జీవి.. కానీ.. చెయ్యదట హాని

one million views for ' alien ' sea creature, ‘ ఏలియన్ ‘ సముద్రపు జీవి.. కానీ.. చెయ్యదట హాని

అలాస్కా లోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ దీవికి వెళ్లిన ఓ మహిళకు సముద్రంలో ఓ వింత జీవి కనిపించింది. అలాంటి జీవిని ఆమె ఎప్పుడూ చూడలేదట.. అచ్చు స్టార్ ఫిష్ మాదిరే ఉన్నప్పటికీ.. రంగు వెరైటీగా ఆరెంజ్ కలర్లో ఆకర్షణీయంగా ఉందది. దాని టెంటకిల్స్ తమాషాగా కదలడమే కాక.. ఒక్కోసారి కుంచించుకుపోతూ, మరోసారి సాగుతూ రబ్బర్ టైపులో కనిపిస్తే ఆశ్చర్యపోయిందామె.. సారా వసెరా అల్ఫోర్డ్ అనే ఈ మహిళ ఈ వింత జీవిని తన ఫేస్ బుక్ లో పోస్టు చేయగానే వీడియో చూసినవాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టారు. అంతే.. సుమారు మూడు వారాల్లోనే ఈ వీడియో పది లక్షల పైగా వ్యూస్ ‘ కొట్టేసింది.’ కొంతమంది దీన్ని ఏలియన్ జాతి స్టార్’ ఫిష్ అయి ఉండవచ్ఛునంటే..మరికొందరు ఇది టెంటకిల్స్ కదిలిస్తున్నప్పుడు రక్తనాళాలు కనబడుతున్నాయి గనుక…. నో డౌట్..’ ఏలియన్లు ‘ వదిలిన జీవే అని కామెంట్ చేశారు. ‘ ‘ ‘అమ్మా ! దాన్ని ఏమీ చేయక మళ్ళీ సముద్రంలో వదిలెయ్యి ‘ అని కొందరు ఆమెను వేడుకున్నారు ఏమైతేనేం.. ఇది ‘ బాస్కెట్ స్టార్ ‘ .. అలాంటి విచిత్రమైన, అరుదైన స్టార్ ఫిష్ అని సారా వసెరా సైతం నిర్ధారణకు వచ్చి.. ఆ వింత జీవిని సురక్షితంగా మళ్ళీ సముద్రంలో వదిలేసింది. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *