మావోయిస్టుల కాల్పుల్లో పోలింగ్ అధికారి హతం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలోని కంథామాల్ జిల్లా బార్లా గ్రామం వద్ద ఎన్నికల విధులకు వెళుతున్న ఓ పోలింగ్ అధికారిని మావోయిస్టులు కాల్చి చంపారు. పోలింగ్ కోసం సంజుక్తా దిగాల్ అనే ఎన్నికల అధికారి విధులు నిర్వర్తించేందుకు కారులో వెళుతుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సంజుక్తా దిగాల్ మరణించారు. ఎన్నికల అధికారులున్న కారును పేల్చివేసేందుకు మావోయిస్టులు మందుపాతర పేల్చినా, తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ […]

మావోయిస్టుల కాల్పుల్లో పోలింగ్ అధికారి హతం
Follow us

| Edited By:

Updated on: Apr 18, 2019 | 7:34 AM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలోని కంథామాల్ జిల్లా బార్లా గ్రామం వద్ద ఎన్నికల విధులకు వెళుతున్న ఓ పోలింగ్ అధికారిని మావోయిస్టులు కాల్చి చంపారు. పోలింగ్ కోసం సంజుక్తా దిగాల్ అనే ఎన్నికల అధికారి విధులు నిర్వర్తించేందుకు కారులో వెళుతుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సంజుక్తా దిగాల్ మరణించారు. ఎన్నికల అధికారులున్న కారును పేల్చివేసేందుకు మావోయిస్టులు మందుపాతర పేల్చినా, తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మరో ఘటనలో మావోయిస్టులు ఎన్నికల వాహనానికి నిప్పు పెట్టి దహనం చేశారు. ఈవీఎంలు, వీవీపాట్‌లను మారుమూల ఫిరింగియా గ్రామానికి తీసుకువెళుతుండగా మావోయిస్టులు అడ్డుకొని వాహనాన్ని దహనం చేశారు.